
Sri Balarama Jayanti Rituals
శ్రీ బలరామ జయంతి
బలరామ అవతారం అంటే శ్రీ మహా విష్ణువు ధర్మ రక్షణ కోసం ఎత్తిన 10 అవతారాలలో ఇది ఒకటి. ఆ బలరాముని జన్మదినానికి గుర్తుగా బలరామ జయంతి జరుపుకుంటారు. శ్రీకృష్ణభగవానుని సోదరుడే ఈ బలరాముడు. మన హిందూ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుని పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ బలరాముడు పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. బలరాముడిని బలదేవా, బలభద్ర మరియు హలాయుధ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
బలరాముడి జననం (Sri Balarama Birth Story)
దేవతలు అందరు విష్ణువును కంసుడిని వధించాలని శరణు కోరితే బలరామకృష్ణులుగా జన్మించి కార్యం చేపడతానని మాట ఇస్తాడు. చెప్పినట్టుగానే విష్ణువు దేవకి గర్భంలోకి చేరుతాడు. అప్పుడు కంసుడు దేవకిని వసుదేవుడిని చెరసాలలో బంధిస్తారు. అప్పుడు యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి యొక్క భార్య అయిన రోహిణి గర్భంలో గర్భ మార్పిడి చేస్తారు. ఆ కాలంలోనే అంత గొప్ప వైద్య సాంకేతికత ఉంది. ఆలా రోహిణి బలరాముడు జన్మనిచ్చింది. ఈ సందర్భంతోనే సంకర్షణుడు అను పేరు బలరామునికి వచ్చింది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
బలరాముడి కథ (Story of Sri Balarama):
మహాభారతం మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆ బలరాముడు గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గురించి తెలిస్తే బలరాముడు గురించి తెలిసినట్లే. వీరిద్దరిదీ విడదీయరాని బంధం. ఆయన సతిమనీ నామం రేవతీదేవి.
అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అని పలుకులు పలికిన బాలకుడు బలరాముడు. ఆయన ప్రకృతి ప్రేమికుడు మరియు పరమానంద స్వరూపుడు. సంకర్షించడమంటే ప్రలోభాలు చూపించేది ప్రకృతి అర్థం. ఆయన అడుగు అడుగులో ప్రకృతి స్పందన తాలుకా ఛాయలు కనబడుతుంటాయి. బలరాముడు గొప్ప యుద్ధ వీరుడు. గొడ్డలి అతని యొక్క ఆయుధం. ఘద విద్యలో యోధుడు. బలరాముడిని గురువుగా భావించి భీముడు, దుర్యోధనుడు గదా విద్యను అభ్యసించేవారు. ప్రకృతిలా ప్రశాంతంగా ఉంటారు, వైపరీత్యాన్ని సృష్టిస్తాడు మరియు అప్యాతతో అక్కున చేర్చుకుంటాడు. ఇవ్వడమే గాని ఆశించడం తెలియనివాడు ఆ బలరాముడు. బలవంతులందరిలోనూ గోప్పవాడు కనుక బలదేవుడు అయ్యాడు. రామ శబ్దానికి సుందరం అనే అర్ధం వలన ఆయన బలరాముడయ్యాడు. సాందీపుడు అనే గురువుగారి వద్ద బలరామకృష్ణులు విద్యాభ్యాసం చేశారు. ఆయన ఎప్పుడు నీల రంగు వస్త్రాలు ధరించేవాడంట. ఆయన జండాపైన తాటి చెట్టు గుర్తు ఉండేది అని అంటారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన సమయంలో తీర్థయాత్రలు వేల్లిన బలరాముడు పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సిన వారిని తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్థంగా ఉన్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత కొంతకాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైపోతుంది. ఆ తర్వాత బలరామశ్రీకృష్ణులు అరణ్యానికి వెళ్తారు. అ సమయంలో బలరాముడు ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానంలో మునిగిపొతాడు. అప్పుడు ఆయన నోటి నుండి ఒక తెల్లని సర్పం బయటకు వచ్చి పడమటి సముద్రంలో కలిసిపొతుంది. అ విశేషమే బలరాముడు ఆదిశేషుని అంశ అని అనడానికి ఒక నిదర్శనం. శ్రీకృష్ణుడితో కలిసి అనేక మంది రాక్షసుల సంహారించడంలో పాల్గొని శ్రీకృష్ణుడికి వేన్నంటే తనదైన ఓ ప్రత్యేకతను చుపిస్తూ బలరాముడు తుదిదాకా శ్రీకృష్ణుడికి వేంటే ఉన్నాడు.
Related Posts
ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs
దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam
సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023