బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగకుండా, ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు
- అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకుల మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిమిషాలయ్యాక కాచి చల్లార్చిన పాలల్లో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకుంటే సరి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
- ఒక చెంచాడు ఉప్పులో ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి, వెంటనే అది కరిగిపోకనే ముఖానికి రాసుకోవాలి. మునివేళ్ళతో మెల్లిగా రెండు నిముషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపైని మృతకణాలు ట్లగిపోతాయి.
- కీరదోసకి చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంది. చిన్న కీరదోస ముక్కని పేస్టు చేయాలి. అందులో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకొని పావుగంట తరువాత కడిగేసుకోవాలి.
- కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా నురగవచ్చే వరకు కలిపి ఒక టీ స్పూను తేనె, ఒక టీ స్పూను సన్‌ఫ్లవర్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత వేడినీళ్లతో కిగితే పొడి చర్మం నునుపుగా మారుతుంది.
- శెనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖంపై గుంటలు త్వరగా పోతాయి.
- స్నానానికి ముందు పచ్చి పసుపు పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తుంటే క్రమేణా చర్మం తెల్లబడుతుంది.
- పండిన బొప్పాయి నుంచి రెండు చిన్నముక్కల్ని కట్ చేసి చూర్ణం చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఫేస్‌ప్యాక్ పొడి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది.
- ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి చూర్ణం తీసుకుని, అంతే పరిమాణంలో ముల్తాన్ మట్టి కలపాలి. రోజ్ వార్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆయిలీ స్కిన్ వారికి ఈ ఫేస్‌ప్యాక్ బాగా నప్పుతుంది. ముఖంపై ఉండే మొటిమలను ఇది అరికడుతుంది.
-
ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకుని అందులోకి పది చుక్కల నిమ్మరసం కలపాలి. బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇలా తరచుగా చేయటం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
- గుప్పెడు బాదం గింజల్ని పాలల్లో రాత్రిపూట నానబెట్టాలి. తెల్లారి వాటిని పేస్ట్ చేసి చర్మానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకోవాలి. బాదంలో చర్మ సౌందర్యానికి పనికొచ్చే విటమిన-ఇ అధికంగా ఉంటుంది. అందువల్ల బాదం పేస్ట్‌ని రాయడం వల్ల ముఖం మృదువుగా అవ్వడంతోపాటు ఆకర్షణీయమైన రంగులో మెరుస్తుంది.
- ఒక టేబుల్‌స్పూను ఉసిరి పొడిలో టీస్పూను పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా రెండుమూడు రోజులకొకసారి చేయడం వల్ల యవ్వన కాంతిని తిరిగి పొందుతారు.