ఆయుర్వేదపరం గా నీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు | Ayurvedic Benefits of Water in Telugu

5
12542
Copper-Vessel-1
ఆయుర్వేదపరం గా నీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు | Ayurvedic Benefits of Water in Telugu

వాగ్బట్టు అనే ఆయుర్వేద శాస్త్రవేత్త నీళ్ళు ఎలా త్రాగాలో చెప్పాడు  ఉదయాన్నే నిద్రలేవడంతోటే పళ్ళుతోముకోకుండా ఒక లీటరు నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయి  నీళ్ళు ఎలా త్రాగాలో ఇప్పుడు చూద్దాం.

రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు తీసి మూతపెట్టి ఉంచుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవడం తోటే ఆలీటరు నీళ్ళు త్రాగాలి.

ఈవిషయం అందరూ చెబుతారు కానీ ఇక్కడ ఒక్క నియమం పాటించాలి. ఎప్పుడూ ఒక్కవిషయం గుర్తుంచుకోండి నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి, పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి.

అంతేకాదు నీళ్ళు గట గటా త్రాగకూడదు. క్రిందకూర్చుని సిప్పు సిప్పుగా టీ త్రగినట్టు, కాఫీ త్రాగినట్టు త్రాగాలి అంతేకానీ నీళ్ళు ఒక్కసారిగా గ్లాసు ఎత్తిపట్టుకుని గట గటా త్రాగకూడదు. ఇదీ నీళ్ళు త్రగేవిషయంలో పాటించాల్సిన ఖచ్చితమైన విషయం.

మరోవిషయం నీళ్ళు ఎన్నిత్రాగాలి…
అందరూ ఏంచెబుతున్నారంటే రోజూ ఖచ్చితంగా 5 లీటర్లనీరు త్రాగాలి అని . ఇది చాలా అసంబద్దమైన విషయం.

మన బరువును 10తో భాగారించి దానిలో నుండి రెండు తీసివేస్తే ఎంత అంకెవస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి.

ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకుంటే 60 ని 10 తో భాగహారిస్తే 6 దీనిలో 2 తీసివేస్తే 4. అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి.

మరో విషయం ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి. భోజనాంతే విషం వారి.

ఆనేది సూత్రం అంటే భోజనం తరువాత నీరు త్రాగండం విషంతో సమానం అని. కొద్దిగా గొంతు తడుపుకోవడానికి, తిన్నతరువాత రెండులేదా మూడు గుటకల నీరు త్రాగవచ్చు.

నీటి విషయంలో ఈ నియమాన్ని పాటిస్తే మలబద్దకం, గ్యాస్ మొదలైన ఉదర సంబంధరోగాలకు దూరంగా ఉండవచ్చు.

మరి నీటి పవిత్రతను నిన్న అర్థం చేసుకున్నాం. ఈరోజు నీటిని ఎలా వాడాలో తెలుసుకున్నాం. ఈ నియమాల్ని పాటిద్దామా.

మంచినీళ్ళకు మట్టి కుండలు వాడండి. త్రాగడానికి క్రిదనిచ్చిన షేపులో ఉన్న రాగి పాత్రను వాడండి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here