
karthika masam 2020
అరటిఆకులో భోజనం మంచిదా?
భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరటిఆకులలో భోజనం చేయడం పరిపాటి. దీనికి ఒక సంప్రదాయంగా పాటిస్తారు. అరటిఆకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి .. తదితర వంటకాలను వడ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించడం అసాధ్యం. అయితే అరటిఆకుపైనే ఎందుకు వడ్డిస్తారంటే ఈ అరటి ఆకులు విషాహారాన్ని , కలుషిత ఆహారాన్ని గ్రహిస్తాయి.
విషాహారాన్ని ఆకుపై వేసిన వెంటనే నల్లగా మారుతుంది. దీంతో ఆహారంలో విషం కలిపినట్టు తెలిసిపోతుంది.దీంతో పాటు అరటిఆకులు అనేక పోషకాలను కలిగివుంటాయి. మనం తీసుకునే ఆహారంతో కలిసి మన శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తాయి. కేరళలో ఇడ్లీలు, కొన్ని రకాల నాన్ వెజ్ వంటలను అరటి ఆకుల్లో వండుతారు. అన్ని విటమిన్లు అందడంతో శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఇది పర్యావరణహితంగా కూడా వుంటుంది.దీంతో సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వుంటాయి. అరటి ఆకుల్లో పాలిఫ్లెనొల్స్ వుంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగివుంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలను వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. వీటిని భుజించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.