
bhagawadgeeta
భగవద్గీత . రోజూ ఒక శ్లోకం నేర్చుకుందాం. 1 వ అధ్యాయం, 9 వ శ్లోకం.
భగవద్గీత, ప్రదమోధ్యాయః, అర్జున విషాద యోగః.
అన్వేచ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ! నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ! 9
అన్వే – చ – బహవః – శూరాః – మదర్థే – త్యక్తజీవితాః నానాశాస్త్రప్రహరణాః – సర్వే – యుద్ధవిశారదాః !
అన్యే – ఇతరులను, చ – కూడ, బహవః – అనేకులు, శూరాః – శూరులు, మదర్థే – ణా కొరకు, త్యక్త జీవితాః – జీవితములపై భ్రాంతి వదిలినవారై, సర్వే – వీరందరును, నానాశాస్త్ర ప్రహరణాః – అనేకములగు శాస్త్రాస్త్రములు గలవారును, యుద్ధవిశారదాః – సమర చాతుర్యము గలవారును
ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యము నందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానా స్త్రాస్త్రదారులై. నాకొరకు తమ జీవితములను ధారపోసియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నారు.