
Bihar Simaria Dham Kumbh Mela Significance
సియారియా ధామ్ కుంభమేళ
మన హిందూ సనాతన ధర్మంలో కుంభమేళా స్నానానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
1. మన హిందూ సనాతన ధర్మంలో కుంభమేళ స్నానానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.
2. హిందూ మత సంప్రదాయం ప్రకారం, ఎవరైన ఒక వ్యక్తి కుంభంలో స్నానం చేయడం వలన అతని పాపాలన్నీ నశించి మోక్షాన్ని కలుగుతుందని హిందూ ప్రజల నమ్మకం.
3. కుంభమేళాకు దేశవిదేశాల నుంచి చాలా మంది అతిథులు వచ్చి స్నానం ఆచరిస్తుంటారు.
4. బెగుసరాయ్‌లోని సిమారియా ధామ్‌లో జరిగిన అర్ధ కుంభమేళాలో మొదటి పండుగ రాజ స్నానం కోసం ఊరేగింపు నిర్వహించారు.
5. మొదటి స్నానంలో 10 లక్షల పైచిలుకు భక్తులు వచ్చారు.
6. మొదటి రాజ స్నానానికి ముందు, దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి వేలాది మంది సాధువులు మరియు విదేశీ అతిథులు ఊరేగింపులో పాల్గొన్నారు.
7. ఆ సాధువులు గంగానదిలో స్నానం చేసి పూజలు చేశారు.
8. ఇక్కడికి పెద్ద సంఖ్యలో నాగ సాధువులు కూడా హాజరవుతారు.
9. వీరు గుడిసెలో నివాసం ఉంటూ 24 గంటలూ పూజల్లో నిమగ్నమైతారు.
10. వీరి యొక్క ఆశీర్వాదం కోసం చాలా మంది భక్తులు రోజంతా వస్తూ పోతూ ఉంటారు.
11. కుంభమేళాకు ఋషులు, సాధువులతో పాటు విదేశీ అతిథులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
12. పోలీసు బృందం సిమారియాలో ప్రత్యేక భద్రతా ఏర్పాటు కుంభమేళా ముగిసే వరకు ఏర్పాటు చేస్తారు.
మతమే సర్వతోముఖాభివృద్ధికి మార్గమని స్వామి చిదాత్మంజీ మహరాజ్ గారు అన్నారు. “మనుషులు మనస్సు రుగ్మతల నుంచి విముక్తి పొందినప్పుడే మతాన్ని అనుసరించడం సాధ్యమవుతుందన్నారు. మనుషుల్లో ఉండే కామ, క్రోధ, అహంకారం వంటి దుర్గుణాలు ఉన్నంత కాలం అతడు స్వచ్ఛమైన మతాన్ని కోరుకున్నా అనుసరించలేదని ఆయన చాలా గొప్పగా చెప్పారు.
Spiritual Related Posts
శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings