2. హనుమంతుని జననం
దేవలోకం లో పుంజికస్థల అనే అప్సరస ఉండేది. ఆమె ఒకనాడు ఆకాశ మార్గం లో విహరిస్తుండగా ఆమెకు వానర రూపం లో ఎవరో కూర్చుని ఉన్నత్త్లు అనిపించింది.
కుతూహలం తోనూ బాల్య చాపల్యం తోనూ పుంజికస్థల ఆ వానరాన్ని రాళ్ళతోనూ, పళ్లతోనూ చెదరగొట్టడానికి ప్రయత్నించింది.
పుంజికస్థల చేష్టలకు ఆ వానరం దిగ్గున లేచింది. తీరా చూస్తే ఆమె రాళ్లువిసిరింది వానర రూపం లో ఉన్న ఒక మహా తపస్విపైన. ఈమె చేష్టలకు ఆయనకు తపోభంగమైంది.
వెంటనే ఆయన క్రోధం తో ‘వానర రూపం లో ఉన్నానని నన్ను హేళన చేశావు కదూ..! నీవు మానవ కాంతవై జన్మిస్తావు, అంతేకాదు నీవు ఎవరినైతే వరిస్తావో అతను వెంటనే వానర రూపం పొందుతాడు.’ అని శపిస్తాడు.
Promoted Content