Where does Krishna river originates?

Where Does Krishna River Originates?

River Krishna Origin / కృష్ణానది పుట్టుక

2. కృష్ణానది పుట్టుకకు కారణమైన కథనం (The Story Behind the Birth of the Krishna River)

భారతదేశమునకు అలంకారప్రాయమైన పడమటి కనుమలలో వెలుగొందుతున్న సహ్యపర్వతమునందు కల్పారంభ సమయమున శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవున్ని ప్రపంచసృష్టి చేయమని ఆజ్ఞాపించాడు.

అప్పడు బ్రహ్మ “ఓ అనంతా! అచ్యుతా! మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. అయితే నేను చేయబోయే సృష్టిధర్మము మీదనే సర్వము ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాబోవు కలియుగములో ధర్మము లోపించకుండా నిలచి ఉండేటట్లుగా మార్గమును చెప్పమని ప్రార్ధించగా విష్ణుమూర్తి తన అంశతో, తనశరీర వామభాగంనుండి కృష్ణానదిని సృష్టించాడు. ఆ కారణంగానే కృష్ణానది కృష్ణా కృష్ణాంగసంభూత జంతూనాం పాపహారిణి అని ప్రస్తుతించబడుతున్నది.

అనంతరం బ్రహ్మదేవుడు కృష్ణానదీమతల్లియొక్క స్వరూపమునుచూసి ఆశ్చర్యమును పొంది ఆమెను తనపుత్రికగా స్వీకరించాడు. విష్ణుమూర్తి ఆదేశానుసారం సృష్టి ప్రారంభించాడు. ఆనాటినుండి కృష్ణ బ్రహ్మపుత్రికగా పిలవబడుతున్నది.

కాలక్రమేణా భూభాగమునందు పాపము పెరిగిపోవటం చూసిన విష్ణువు పాపపరిహారము కొరకై తన రూపచతుష్టయమైన వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ వ్యూహములలో ఒకటైన, అధర్మనాశన – ధర్మసంస్థాపన చేయు ప్రద్యుమ్నునిచూసి, పాపపరిహారం కొరకు బ్రహ్మదేవుని అధీనంలోఉన్న కృష్ణానదిని భూలోకానికిచేర్చే బాధ్యతను అప్పగించాడు.

వెంటనే ప్రద్యుమ్నుడు ఇంద్రాది దేవతలంతా వెంటరాగా కృష్ణను బ్రహ్మనుండి తీసుకుని దానిని నిలపగలిగిన ప్రదేశం కొరకు ఆలోచిస్తుండగా, ఒకచోట పర్వతాకారమును ధరించి తపస్సు ఆచరిస్తున్న సహ్యమహామునిని చూచి ప్రద్యుమ్నుడు ఈ విధంగా అనెను. “ఓ మునీంద్రా! ఎందుకోసం నీవు ఇంతటి ఘోరమైన తపస్సు ఆచరిస్తున్నావు? ఈ భూమిని తరింపచేయుటకు సాక్షాత్తూ విష్ణుస్వరూపమే అయిన కృష్ణ నావెంట ఉన్నది. అది ఎవ్వరు ఏది కోరినా వారి కోరికలను కృపతో తీర్చును. కావున ప్రార్ధించినచో నీ కోరికలుకూడా తీర్చును.” అని చెప్పగా అపుడు సహ్యమని సాష్టాంగ నమస్కారముచేసి ఈ విధంగా ప్రార్ధించాడు.

“ఓ ప్రభూ! నేను విష్ణుసాయుజ్యాన్ని పొందుటకై తపస్సు ఆచరిస్తున్నాను. అటువంటి సందర్భములో మీరు సర్వజనులకు హితము చేయుటకై కృష్ణను వెంటబెట్టుకొని రావడం నాకు మహదను గ్రహం. నా జన్మసఫలమైనది. ఈ నదీమతల్లికి భక్తితో సేవలుచేసి బ్రహ్మజ్ఞానమును పొంది కృతార్ధుడనవుతాను. హరిహర స్వరూప ములైన శ్రీకృష్ణా, కృష్ణలగు మీరిద్దరూ నాపైనిలచి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్ధించాడు.

అప్పడు కృష్ణానదీమతల్లి సహ్యమునీంద్రునిచూచి –

“ఓ మునీంద్రా! నీ తపస్సు సిద్ధించినది. నేను నీపై నివసించెదను. నీవలన జగత్తుఅంతా పవిత్రత పొందగలదు అనిపలికెను. అంతలో ప్రద్యుమ్నుడుకూడా ఓ ఋషివర్యా! నీమీద నాకు విశేష అనుగ్రహము కలిగినది. కావున నీవు తరించేటట్టుగా పర్వత రూపుడవైన నీపైనేను నిత్య నివాసాన్ని ఏర్పరచుకుంటానని చెప్పాడు.

అనంతరం మునీంద్రుడు సంతోషముతో ఇంద్రాది దేవతల నందరిని పూజించగా వారు వారి స్వస్థానములకు వెళ్ళారు.

అప్పుడు ప్రద్యుమ్నరూపుడైన శ్రీకృష్ణుడు శ్వేతాశ్వత్త రూపమున సహ్యాద్రి పర్వతముపై వెలశాడు.

కృష్ణ ఆ వృక్షములో అంతర్భాగమున నివసిస్తుండెను.

కొంతకాలం అనంతరం బ్రహ్మ ఆచోట విష్ణుమూర్తిని ఆరాధించెను.

వెంటనే శ్రీహరి శ్వేతాశ్వత్త వృక్షము మధ్యలో ప్రత్యక్షమైనాడు. అప్పడు బ్రహ్మ సంతోషముతో తన కమండలంలో ఉన్న సరస్వతీ యుతమైన విరజానది పవిత్రోదకముతో విష్ణువు పాదములను కడిగి, ఆ ఉదకము అక్షయమగునట్లుగా ప్రార్ధించగా, విష్ణువు తనలోని అమృతత్త్వమును ఆ ఉదకమునకు అనుగ్రహించి నదీ రూపకముగా ప్రవహింపచేసి ఇంతకుముందు తాను సరస్వతీదేవి వలన పొందిన శాపమునుండి విముక్తిని పొందెను.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here