అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా? | Why Men Don’t Cry in Telugu?

0
1325

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్ని సార్లు వెక్కివెక్కి ఏడుస్తారు. అందునా మహిళలు, అమ్మాయిలు అయితే అంతే సంగతులు ఆకాశానికి చిల్లు పడిందా అనేవిధంగా వారి కళ్లలోనుంచి కన్నీరు అలా వస్తుంది. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఎందుకు ఏడవరు? వారికి కూడా కష్టం, బాధ కలుగుతాయి కదా, అయినా వారి కంట్లో నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదు? అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతారు ? ఎందుకు అబ్బాయిల్లో కొంత మంది మాత్రమే ఎమోషనల్‌గా ఫీలౌతారు. వారికి మాత్రం ఫీలింగ్స్‌ ఉండవా? ఇంతకీ వారికి వీరికి ఉన్న తేడా ఏంటి? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ పరిశోధకులు కారణాలు కనుగొన్నారు.

స్విట్జర్లాండ్‌లోని బెసేల్‌ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, పరిశోధకుడు నోరా మరియా రసెల్‌ బృందం చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలు, అబ్బాయిల్లో భావ నియంత్రణపైన పరిశోధన జరిపిన బృందం కొన్ని సరికొత్త విషయాలను బయటపెట్టింది. ఈ పరిశోధనలో అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేరువేరుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. అబ్బాయిల మెదడులో  భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19శాతం ఎక్కువగా ఉంటుందని వారు తేల్చారు. దాని కారణంగానే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని రసెల్‌ తెలిపారు. అందుకే మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని వారు చెబుతున్నారు. ఈకారణంగానే అబ్బాయిలు ఎంత భాధ వచ్చినా తొందరగా ఏడవరని యూనివర్సిటీ బృందం తేల్చింది. ఈ పరిశోధన 189 మంది పైన చేసినట్లు రసెల్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here