
బఫే మీల్స్ మంచిదా కాదా?
Is Buffet Meals Good for Health – భారతీయ దృక్పథంలో ఆహారం శరీరానికి మాత్రమే కాకమనస్సుకు కూడా పుష్టిని కలిగిస్తుంది. ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది.
అందువల్లనే ఆహార పదార్థాల విషయంలో మాత్రమే గాక ఆహార స్వీకరణ విధానాలకు వాటి సమయాలకు, మనస్సుమీద గల ప్రభావాన్ని కూడా మన మహర్షులు అధ్యయనం చేశారు.
తత్ఫలితంగా మానవులు కదలకుండా కూర్చుని ఏకాంతంగా గానీ, సమానమైన మనోధర్మం గల యోగ్యులతో కలిసి కానీ సచ్చింతన పూర్వకంగ ఆహారాన్ని స్వీకరించాలని వారు నియమాలను ఏర్పరిచారు.
ఈ నియమాలను తప్పిన వారు క్రమక్రమంగా మానసిక సమతౌల్యాన్ని కోల్పోక తప్పదు. ఈనాటి సమాజంలో మనం ఈ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం కదా!