ఒకే ఇంటి నుండి ఇద్దరు అమ్మాయిలను (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం ),మరొక ఇంటికి సంబంధించిన ఇద్దరు అబ్బాయిలకు (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం )పెళ్లి చేయవచ్చునా?
కొద్ది మందికి ఇది ధర్మ సందేహం.ఐతే దీనికి వేద ప్రమాణంగా లేదా స్మృతి ప్రమాణంగా కాని చూసినా, ఎక్కడా ఆధారపూర్వకంగా సమాధానం దొరకదు. ఎందుకంటే ఇటువంటి వివాహములు కూడదు అని పండితులమాట. ఐతే ఈ రోజుల్లో సొంత అన్న దమ్ములు మధ్యే తగాదాలు ఉండడం సహజం. అలాంటిది ఒకే ఇంటి పిల్లలు తోడి కోడళ్ళు అవ్వడము వలన తగాదాలు ఉండవు అని భావించి , వివాహం చెయ్యవలసిన అవసరం లేదు. చాలా మంది పెద్దలు ఆలోచనచేసి ఇలాంటి వివాహం వలన సమస్యలు అధికంగా ఉండడం గమనిచడం వలన వద్దు అని చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇటువంటి వివాహములు చేసుకోరు.