దేవుడి పూజ కు క్యాసెట్లు అవసరమా?

0
6567

pundit replacing cds
కొద్దిమంది పూజా ఆడియో క్యాసెట్లు పెట్టి రుద్ర మంత్రాలతో అభిషేకం, పూజలు చేస్తున్నారు సబబా ?

గత్యంతరం లేనప్పుడు చేసుకుంటున్నారు. కానీ వాటిలో ప్రవీణుడై అనుష్ఠానపరుడైన విప్రుని బ్రహ్మస్థానంలో ఉంచి, అభిషేక, అర్చనాదులను ఆచరించడం సంప్రదాయం.

ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో – రికార్డు చేసిన మంత్రాలద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.

నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.

వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుని) ఉచిత స్థానంలో ఆసీనుని చేయాలి. యజ్ఞాలో ’ఋత్విగ్వరణం’ ఇదే. అలాగే పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here