కాలీఫ్లవరు | Cauliflower Benfits

0
3240
Cauliflower
Cauliflower Benfits

Cauliflower Benfits / కాలీఫ్లవరు

ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు… ఇలా ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే కూరగాయల్లోనే కాదు, తెలుపురంగులో ఉండే ముల్లంగి, కాలీఫ్లవర్ వంటి వాటిలోనూ బోలెడు పోషకాలు ఉంటాయన్నది తెలిసిందే. ఉదాహరణకు కాలీఫ్లవర్‌నే తీసుకుంటే- ఇందులో పీచూ బి-విటమిన్ రెండూ సమృద్ధిగా లభ్యమవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్‌నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్బినాల్ అనే యాంటీఆక్సిడెంట్ స్త్రీ, పురుషలిద్దరిలోనూ రొమ్ము, ప్రత్యుత్పత్తి అవయవ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇక, ఇందులోని పీచూ నీటిశాతమూ శరీర బరువుని తగ్గిస్తాయి. ఈ రెండూ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంతోబాటు కోలన్ క్యాన్సర్ రాకుండానూ కాపాడతాయట. అధ్యయనం, జ్ఞాపకశక్తులకు తోడ్పడే కోలీన్ అనే కీలకమైన పోషకం కూడా కాలీఫ్లవర్‌లో లభ్యమవుతుంది. వూబకాయం, మధుమేహం, హృద్రోగం… వంటివి రాకుండానూ కాపాడుతుంది. ఇందులోని విటమిన్-కె ఎముకల దృఢత్వానికీ దోహదపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here