దేవదారు పత్రం | Devadaru Patram in Telugu

0
3841

Cedrus Deodara-HariOme

Devadaru Patram / దేవదారు పత్రం

సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి

Devadaru Patram . దీనికి సంస్కృతంలో సురాహ్వయ, భూతహారి, దేవ కాష్ఠ అనేవి పర్యాయపదాలు. దీని శాస్త్రీయ నామము సెడ్రస్ దియోడర్(cedrus deodara).

దేవదారు సమస్త దేవతలకు ఆవాసమైన హిమవత్పర్వత శ్రేణులలో ఉంటుంది. ఇది అందంగా చాలా ఎత్తుగా పెరుగుతుంది, ఎల్లవేళల ముదురు ఆకుపచ్చ పత్రములతో ప్రకృతిలో శోభాయమానముగ ఉండే దీనికి సాలవృక్షము, సరళదేవదారు అని పేర్లు. కుమారసంభవంలో దేవతలు విహరించే హిమాలయ పర్వత శ్రేణులలో సాలప్రాంశుర్. అని వర్ణించారు. ఈ వృక్షము నుండి శ్రావణమాసంలో స్రవింపజేయు మాసము), నిర్యాసము ప్రవించును దీనిని సరళ నిర్యాసము అంటారు. ఇది మహీసుగంధ ధూపద్రవ్యము. దీని మానుతో విగ్రహములు చెక్కుతారు. దేవి సంబంధ యజ్ఞ యాగాది క్రతువులలో యజ్ఞ సమిధగా వాడతారు. దీనినుండి పైన్ ఆయిల్ అనే తైలము తీస్తారు. ఈ తైలమును రంగుల పరిశ్రమలో, కీళ్ళ నొప్పులకు, వ్రణ శోధనమునకు వాడతారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here