మన పండగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో ఉన్నవి కావడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. దక్షిణాయాన ప్రారంభ కాలంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. హైదరాబాద్ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. బోనమంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. అన్నమనేది సకల జీవులకు ఆహారం. అలాంటి ఆహారాన్ని అమ్మవారు మనకు ఇస్తుంటారు. అందుకు కృతజ్ఞతగా ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం.