తనకు ఎవరిపైనా ద్వేషభావన లేదని…తన ప్రవచంనలో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. యాదవులపై చేసిన వ్యాఖ్యలకు చాగంటి కోటేశ్వరరావు క్షమాపణలు చెప్పారు. చాగంటి తమ కులాన్ని అవమానించారంటూ తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాగంటి స్పందించారు. ‘యాదవుల భాగ్యాన్ని, వారి అమాయకత్వాన్ని వర్ణించేటప్పుడు తెలుగు భాషలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మాటను నేను అన్నాను…కానీ, ఆ మాట వెనుక ఉద్దేశం పరమ పవిత్రం..వాళ్లను విమర్శించడం, తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు…ఒకవేళ, నేను అలా అన్నప్పుడు ఎవరైనా ఆ మాటల వల్ల బాధ పడి ఉంటే దానికి నేను క్షంతవ్యుడిని అని అన్నారు. మనసులో అన్యభావన పెట్టుకోవద్దని కోరుతున్నాను’ అని చాగంటి అన్నారు.
Courtesy : BhaaratToday
Me lanti varu chaminchandi anakandi swami?