చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu

0
11215
chanakya-principles
చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu

చాణక్య సూత్రాలు | Chanakya Sutras in Telugu

* ముందు ఆత్మని సంపాదించుకున్న తరువాత, అనగా తనకు తాను చక్కబరుచుకున్న తరువాత సహయుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి.
* సహాయులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేడు .సుఖ దుఃఖాలు సమానంగా పంచుకున్నవాడే సహాయకుడు.
* స్నేహితుడు కదా అని విద్యావినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు .
* ఆలొచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు. ఆలొచనలు చాలా రహస్యంగా ఉంచడం చాలా శ్రేష్టమైనది .
* ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. మిత్రులని సంపాదించడం చేత బలం చేకూరుతుంది.
* లేనిదాన్ని సంపాదించడం , సంపాదించినదాన్ని రక్షించుకోవడం , దాన్ని వృద్ధి పొందించుకోవడం , తగినరీతిలో వినియోగించుకోవడం , ఈ నాలుగే రాజ్యతంత్రం అంటారు.
* మద్య ఒకరాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైనవాడు మితృడు. వీరిద్దరు సహజ శత్రుమిత్రులు. ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రు, మిత్రులు అవుతుంటారు.
* బలం తగ్గిపోయినవాడు సంధి చేసుకోవాలి . బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు.
* బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకొవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో గాని , సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు .
* శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు ఒకరితో సంధి చేసుకొని రెండోవానిపై యుద్ధానికి వెళ్ళాలి.
* జూద వ్యసనం ఉన్నవాడు ఏ పని సాధించలేడు . వేట వ్యసనం ఉన్నవాడు వాని ధర్మం , అర్థం కూడా నశిస్తాయి . కామాసక్తుడు ఏ పని చేయలేడు .
* రాజుకి ధనాసక్తి ఉండటం వ్యసనంగా పరిగణించబడదు . ఉన్న ధనం చాలులే అనుకునే రాజుని లక్ష్మి వదిలేస్తుంది .
* ఏది ఎలా చేయాలో ముందు నిశ్చయించుకున్న తరువాత ఆ పని ప్రారంబించాలి. పని ప్రారంబించిన తరువాత మద్యలో తెగతెంపులు లేని ఆలొచనలు చేయకుడదు .
* పని జరిగిన తరువాతనే బయట చెప్పాలి. ఎంత తెలిసినవాళ్ల పనులు అయినా దైవదోషం చేత , మానవ దొషం చేత చెడి పోతుంటాయి .
* దైవ దోషాన్ని శాంతి కర్మలు చేసి నివారించుకోవాలి. మనుషుల వల్ల జరిగే కార్యవిగాతాన్ని నేర్పుతో తప్పించుకోవాలి.
* ప్రత్యక్షంగా చూసి , పరోక్షంగా ఇతరులవల్ల విని, తాను ఊహించుకొని కార్యాన్ని పరీక్షించాలి. పరీక్షించకుండా పనులు చేసేవాడ్ని లక్ష్మి త్యజిస్తుంది. పని కావాలి అనుకున్నవారు ప్రభువు స్వభావం ఎలాంటిదో తెలుసుకుని పని సాదించాలి.
* తన లోపాలని ఎప్పుడు బయటపడనీయ వద్దు . శత్రువులకు కుడా ఏవో లోపాలు కనపడినప్పుడే దేబ్బతీస్తారు. చేతికి చిక్కినా కూడా శత్రువుని నమ్మకూడదు.
* హితమైన పదార్దం కుడా తన శరీరానికి అది పథ్యం కానప్పుడు , అజీర్ణంగా ఉన్నప్పుడు తినకూడదు . తిన్నది జీర్ణం అయిన తరువాత భుజించేవాడి దగ్గరకు రోగాలు రావు .
* ధనం సంపాదిన్చేప్పుడు నాకు మరణం లేదు అన్నట్లు సంపాదించాలి. సాక్షాత్తు దేవేంద్రుడు అయినా ధనం లేనివాడిని లొకం గౌరవించదు.
* ఇతరుల గుణగణాలను తెలుసుకోగలిగిన వాడు ప్రభువుని ఆశ్రయించాలి. కూడని స్త్రీతో సంభందం వలన ఆయుర్దాయం, కీర్తి, పుణ్యం నశిస్తాయి .
* తలపెట్టిన పని సఫలం అవుతుందా లేదా ? అన్న విషయాన్ని శకునాలు సూచిస్తాయి. శకునాలు అనగా దుస్వప్నం, అవయవాలు అధరడం మొదలయినవి. జ్యోతిష్యం కంటే కుడా శకునాలు విశిష్టం అయినవి. అవి నిజం అవుతాయి.
* అతిగా పెట్టుకున్న సంబందం దోషానికి హేతువు అవుతుంది.
* అపకారం చేసిన వాడిమీద కొపం చూపవలసి వస్తే తన కొపం మీద కొపం చూపాలి.
* బుద్ధిమంతులతో , ముర్ఖులతో , మిత్రులతో , గురువులతో, ఇష్టులైనవారితో వాగ్వివాదానికి దిగకుడదు.
* పిశాచాలు లేని ఐశ్వర్యం లేదు . అత్యదిక ఐశ్వర్యం కూడబెట్టిన వాడు మరణాంతరం పిశాచం అవుతాడు.
* ఏ ఉపద్రవాలు లేని దేశంలో నివసించాలి. ఎక్కువమంది సత్పురుషులు ఉన్న దేశంలో నివసించాలి.
* రాజు దగ్గరకి, గురువు దగ్గరకి , దేవుడు దగ్గరకి రిక్తహస్తాల తో వెళ్ళకూడదు .
* పెద్ద కుటుంబం కలవానికి భయపడాలి. ఎల్లప్పుడు రాజగృహానికి వెళుతూ ఉండాలి.
* రాజ పురుషులు ( అదికారులు ) తొ సంభందం పెట్టుకొవాలి. రాజుకి సంభందించిన వేశ్యలతో సంభందం పెట్టుకోకూడదు .
* ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసి వస్తుందో అన్న భయం చేత నీచుడు శతృత్వం వహిస్తాడు. ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కుడా ప్రత్యుపకారం చేయడానికి చేరి ఉంటాడు.
* నీళ్లలో ముత్ర విసర్జన చేయకుడదు . నగ్నంగా నీటిలో దిగకుడదు. అగ్నిలొ మరొక అగ్ని వేయకుడదు .

********* కాళహస్తి . వెంకటేశ్వరరావు.********

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here