
Chaturmasya Vratham / చాతుర్మాస్య వ్రతం
ఈ రోజునుండి చాతుర్మాస్య వ్రతారంభం అవుతుంది. ఈ వ్రతం చేయాలనుకునేవారు ఈ రోజు నుండి కార్తికశుద్ధ ఏకాదశి వరకుగల నాలుగు నెలలపాటు బెల్లం, తైలం విడిచిపెడతామని సంకల్పించుకోవాలి. భగవంతునికి నివేదన చేయని ఆహారం, కాల్చివండినవి, మాంసాహారం, పుచ్చ కాయ, గుమ్మడికాయ, చెరకు, కొత్తఉసిరిక, చింతపండు, మంచం పైన పడుకోవడం, పరాన్నం, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు. మినుములు ఈ నాలుగు నెలలు వాడకుండా నియమంగా భగవత్పూజ చెయ్యాలి.