ఆరోగ్యపరంగా సపోటా పండు | Chikoo Health Benfits in Telugu

0
3570
12380033_996193497140005_21297196_n
ఆరోగ్యపరంగా సపోటా పండు | Chikoo Health Benfits in Telugu

ఆరోగ్యపరంగా సపోటా పండు | Chikoo Health Benfits in Telugu

సపోటా పండులో పీచు పదార్థం ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ప్రోటీన్లు, ఐరన్ శక్తి అధికంగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది.

ఈ పండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. సపోటా విటమిన్ A ని అధికంగా కలిగి ఉంటుంది. పరిశోధనల ప్రకారం, విటమిన్ A వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు, విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది.

ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయపడుతుంది.

సపోటా పండు పీచుని (5.6/100గ్రాముల) అధిక మొత్తంలో అందిస్తుంది. అందువలన దీనిని అద్భుతమైన విరేచనకారి మందుగా భావిస్తారు. దీనిలోని పీచు పదార్ధం మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం.

ఇది నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయపడుతుంది. ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది.

సపోటా పండు చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు ఉన్నప్పుడు ముక్కు నాళాలలో నుండి దగ్గు, శ్లేష్మం తొలగించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గడానికి దోహదంచేస్తుంది.

సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి, ఒక పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేయండి.

దీనివల్ల మీ జుట్టు మృదువుగా ఉండి, చుండ్రు సమస్యను నియంత్రిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను అరికట్టడం ద్వారా చర్మం పై ముడతలను కూడా తగ్గిస్తుంది

ఇది మొలలు, జిగట విరోచనాల నుండి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది. సపోటా విత్తనం పొడి మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకంగా పనిచేస్తుంది.

అలాగే ఇది మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది. సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది, గాస్త్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది, తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది.

సపోటా. అయితే తీపి అధికం గా ఉండడం వల్ల షుగర్ ఉన్నవారు దీనిని దూరంగా ఉంచాలని డాక్టర్లు చెబుతారు.

సపోటా విత్తనాల నుండి తీసిన నూనె మీ జుట్టు తేమగా, మృదువుగా ఉండడానికి సహాయపడి, బాగా నిర్వహిస్తుంది. ఇది కాంతిని అందించి, రింగుల జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జిడ్డు లేకుండా శులభంగా గ్రహిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here