ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే చాలు, సంతానము లేని వారు వివాహం కాని వారు, రాహు, కేతు, కుజ, సర్ప దోషమున్న వారి భాధలు తొలుగుతాయి.

0
220
Subramanya Swamy Temple
Subramanya Swamy Temple

Subramanya Swamy Temple

1శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము, మోపిదేవి:

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

చరిత్ర (history):

మోపిదేవి, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రసిద్ధి చెందింది. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది.

పురాణం (legend):

ఒకానొక సమయంలో, సనక సనందనాది మహర్షులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్ళారు. అక్కడ బాలుడైన కుమారస్వామి తల్లి పార్వతీదేవి అంకముపై కూర్చుని జడధారులతో, కాషాయ వస్త్రంతో, కమండలంతో ఉన్న మహర్షులను చూసి నవ్వాడు. దానికి కోపించిన పార్వతీదేవి, కుమారస్వామి తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆదేశించింది. దీనితో కుమారస్వామి భూలోకంలోని నేటి మోపిదేవి ప్రాంతంలో సర్పరూపం ధరించి వల్మీకంలో నివసించుచూ తపస్సు చేసుకున్నాడు.

అగస్త్య మహర్షి రాక (Arrival of sage Agastya):

దక్షిణ దేశయాత్రకు బయలుదేరిన అగస్త్య మహర్షి, కృష్ణానది తీరంలోని మోహినీపురం (నేటి మోపిదేవి) చేరుకుని స్నానమాచరించి, ఒక పెద్ద వటవృక్షం క్రింద తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడ ఒక వల్మీకం నుండి “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరీ మంత్ర ధ్వని వినిపించడం గమనించాడు. ధ్యానంలోకి వెళ్లి చూసిన అగస్త్యులకు, కుమారస్వామి శాప పరిహార్ధం కోసం తపస్సు చేసుకుంటున్నట్లు తెలిసింది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back