
1. ఛిన్నమస్తఎవరు? ఆమె ఎలా ఉంటుంది ?
ఛిన్న మస్తాదేవి కే వజ్ర వైరోచనీ అనీ,ప్రచండ చండీ అనీ పేర్లు కలవు. ఉత్తర భారతదేశం లో చింతపుర్ణీ అని పిలుస్తారు.
శక్తి ఉపాసకులైన శాక్తేయులు, తాంత్రికులు అమ్మవారి ఉపాసనను చేస్తారు. ‘ఛిన్న’ అంటే ఖండించిన, ‘మస్తా’ అంటే శిరస్సు.
తన శిరస్సును తానే ఖండించుకుని ఆ రుధిరధారలను తానే తాగుతూ కనిపిస్తుంది. ఆమె మైథునం చేస్తున్న జంట పై నిలబడి ఉంటుంది. ఆమె శరీరం నుండీ మూడు రక్తధారలు వెలువడుతాయి.
ఒకటి అమ్మ తానే స్వయంగా ఆస్వాదిస్తుంది. మిగిలిన రెండు ధారలు ఆమెకు ఇరువైపుల ఉన్న సహాయోగినులైన డాకిని, వర్ణినులు (వారినే జయా విజయలు అంటారు) త్రాగుతూ కనబడుతారు.
ఆమె మెడలో కాపాలాలు హారంగా ఉంటాయి. సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి ఉంటుంది.
Promoted Content