
Ways to Clean Skin – మన ఆరోగ్యానికి అద్దం లాంటిది చర్మం. చర్మం శుభ్రంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం.
మంచినీళ్లు తగినన్ని తాగడం వల్ల శరీరం లోని మలినాలు తొలగుతాయి. చర్మం కాంతివంతమవుతుంది. చర్మాన్ని కాలుష్యం బారినుండి సాధ్యమైనంత కాపాడాలి.
చర్మాన్ని మూడు దశలుగా శుభ్ర పరచాలి. మొదట చర్మం తట్టుకో గలిగినంత గరుకుదనం ఉండే పిండి తో(scrub) రుద్ది చర్మంపై గల మృత కణాలను తొలగించాలి.
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి మెత్తని పిండిని లేదా ఏదైనా చర్మానికి పోషణనిచ్చే అరటి, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును పట్టించి కాసేపు ఆరనివ్వాలి.
తరువాత సున్నిపిండి తో గానీ తక్కువ రసాయనాలు గల సబ్బుతో గానీ కడగాలి. దీనివల్ల చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి.
ఈ సమయం లోనే తక్కువ మోతాదు లో చర్మం పైని తేమను కాపాడే తేలిక పాటి నూనె లేదా మాయిశ్చరైజర్ ను రాయాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం యవ్వన కాంతిని సంతరించుకోవడమే కాకుండా మొటిమలు, నల్ల మచ్చలు వంటి చర్మ రోగాలు రాకుండా ఉంటాయి.
ఇలాంటివి తేలియచేయండి subramanyam swami ni poojinchatam please
Dhayachesi. Yalapoojinchali anjaneya swamini subramanyam wsamini niyama nibandhanalu telupagalaru
Simha raasi phalithalu theliya Jaya galaru.