
గోముఖం నుండి కృష్ణా / Origin Of Krishna River
Origin Of Krishna River – కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం మహాదేవుని ఆలయం – వద్దగల గోముఖంనుండి వెలువడుతుంది. ఇది ఎంతో పరమ పవిత్ర మైన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇక్కడ కృష్ణానదిని కృష్ణాబాయి అంటారు. ఈ గోముఖంనుండి బయటకు వచ్చిన కృష్ణానది అతివేగంతో మహారాష్టలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూలగానుండి నలభై అయిదుమైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహా రాష్ట్రగుండా మరోపదిమైళ్ళ సాగి వేణీ నదిని కలుపు కొని కృష్ణవేణీనదిగా ఖ్యాతి గాంచింది.
అనంతరం-దక్షిణ మహా రాష్ట్రలో మరో 150 మైళ్ళ ప్రవహించిన కృష్ణానది కర్ణాటకలో కలుస్తుంది.