ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja

0
10362
gomatha-300x257
ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja

శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా
సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !!

గోవు యొక్క గొంతుక నందు,పొదుగులో,మూత్రములో,గంగా దేవి ఉంది . అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములు లో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి .
గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు .

ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది . పురోహితులు ప్రతీ పూజకు ఆవుపాలు ,పెరుగు , నెయ్య ఖచ్చితం గా కావలి శాస్త్రం ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు .పాల పాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలుకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవుపాలు కోసం వెదకటం మంచిది . గోశాలలు కు విరాళం ఉన్నంతలో కొంత మన భాద్యత గా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు , వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణ శాల లో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం.

యే ఊరి నందు ఐతే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని భాదలు ఉండవు అని శాస్త్ర వచనం . విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ది ఆయన ఇస్తాడు . గోదాన ఫలం అంతా ఇంతా కాదు,గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here