దూర్వా | Durva in Telugu

0
2520
Cynodon_dactylon-HariOme
దూర్వా | Durva in Telugu

దూర్వా | Durva in Telugu

గజాననాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి

దూర్వా అనగా గరిక, ఇది శ్వేత దూర్వా నీల దూర్వా మరియు గండదూర్వా అని మూడు రకములు. గండ దూర్వాకు గండాలి అని పేరు.

శ్వేత దూర్వా (తెల్లగరిక)కు సంస్కృతంలో శతవీర్యా అని, నీల దూర్వా (నల్ల గరిక)కు బుర్రం • సహస్రవీర్యా అని పేర్లు. 

శ్వేత దూర్వాకు (cynodon dactylon) అని, నీలదూర్వాకు సైనోడాన్ లీనియారిస్ (Cyanodon linearis) అనేవి శాస్త్రీయ నామములు.

 దూర్వా మరియు నీల దూర్వాలకు వైద్య శాస్త్రంలో దూర్వాద్వయం అని పేరు. దూర్వాయుగ్మం అనగా రెండు దళములు కలిగిన దూర్వా గండదూర్వను లతాదూర్వా అని కూడ అంటారు.

దీని వేరు భూమి పైన తీగమాదిరి పెరిగి ఆ లతపైన దూర్వలు మొలుస్తాయి.

ఇవి గడ్డిజాతికి చెందిన మొక్కలు. వినాయక పూజ యందు దూర్వాకు విశేష ప్రాధాన్యత కలదు.

గణపతి అధర్వ శీర్షమునందు “యో దూర్వాంకురరై రజతి సవైశ్రవననోపమో భవతి” అని దూర్వాహోమము ప్రాశస్త్యము చెప్పబడినది.

దుర్గాసూక్తమున- సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతుమే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ అని చెప్పబడింది.

శ్రీ ఆదిశంకర విరచిత చతుష్టష్టి పూజ యందు కూడా దూర్వాకు ప్రాధాన్యత కలదు.

దూర్వాదళాలను దాహము, తృష్ణ, చర్మ రోగములు మరియు దారుకము(చుండ్రు)నకు విశేషముగా వాడతారు.

దుస్స్వప్నానికి కారణమైన మూత్రావరోధమును హరించుట చేత దూర్వా దుస్స్వప్ననాశిని అని చెప్పబడింది. ఇది మూత్ర విరజనీయముగా పనిచేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here