ఈ రోజు కధ – పగటికల

1
4352

 

daydream-2

భవిష్యత్తుని గురించి కలలుకనటం చాలామంచి విషయం. కానీ కళలు మాత్రమే కంటూ కాలయాపన చేస్తే భవిష్యత్తు శూన్యమవుతుంది. ఈ జీవన సత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను తెల్సుకుందాం.

పగటికల

ఒక ఊళ్ళో ఓ భిక్షగాడు ఉండేవాడు. ఒకరోజు అతనికి సరిపడా భోజనంతో పాటు ఒక కుండెడు బియ్యం కూడా దొరికింది. అతను రెండురోజులపాటు తిండికి దిగులుపడవలసిన అవసరం లేదని ఎంతో సంతోషించాడు. ఆ కుండను కాళ్ళ దగ్గర పెట్టుకొని ఇలా ఆలోచించ సాగాడు.

ఈ కుండెడు బియ్యాన్ని అమ్మితే రెండు వరహాలు వస్తాయి.  వాటితో మంచి వ్యాపారం చేసి బాగా ధనవంతుడిని అవుతాను. అప్పుడు ఇంటినిండా పనివాళ్ళను  పెట్టుకొని దర్జాగా జీవిస్తాను అని ఆలోచించ సాగాడు అంతలో అతనికి తనవద్దనున్న పనివాళ్ళు ఏదో పొరపాటు చేసినట్టు దాని కారణం గా ఆ పనివాడిని కాలితో తన్నినట్టు కలగన్నాడు. వెంటనే కళ్ళు తెరచి చూసే సరికి కుండ పగిలి ఆ బియ్యం మొత్తం మట్టిపాలయినవి.

ఈ కథ వల్ల తెలిసే నీతి పగటి కలలు పనికి చేటు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here