అసలైన దానం (ఈరోజు కథ) | Story of Donation in Telugu

0
12445
  • The_Golden_Mongoose__32449.1299733426.1280.1280
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

అసలైన దానం (ఈరోజు కథ)

దాన ధర్మాలు ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు వాటి సార్థకతను కోల్పోతాయి. అటువంటి దానాలవల్ల మనదగ్గర ఉన్న ధన సంపద మాత్రమే ప్రదర్శింపబడుతుంది కానీ దానగుణం, మంచితనం కాదు.

అసలైన దాన గుణం ఎంతగొప్పదో చెప్పే ఒక మహాభారత కథను తెలుసుకుందాం.

3. ముంగిస చెప్పిన కథ

రాజా..! నేను పూర్వం ఒక సంఘటనను చూశాను. ఒకనాడు నేను ఓ పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాను. అది భోజన సమయం.

ఆ ఇంట్లోని వారంతా అతిథి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అతిథికి భోజనం పెట్టనిదే వారు ఏనాడూ ఎంగిలిపడలేదు. ఇంతా వారి దగ్గర తినడానికి ఉన్నది కాస్త పేల పిండి మాత్రమే.

దాన్నే వారు తలాకాస్త పంచుకుని అతిథికి పెట్టడానికి తీసిపెట్టారు. ఎంతో సేపటికి ఒక బాటసారి ఆ ఇంటికివచ్చి ‘చాలా ఆకలితో ఉన్నాను స్వామీ తినడానికి ఏమైనా ఉందా?’ అని అడిగాడు.

ఆ ఇంటిలోనివారు అమితానందం తో అతనికి తమ దగ్గర ఉన్న పేలపిండిని పెట్టారు. అతిథి తనభాగం తిన్నా ఆకలితీరలేదు. ఆ ఇంటి యజమాని తనకోసం ఉన్న ఆహారాన్ని అతిథికి పెట్టాడు. అయినా అతని ఆకలి తీరలేదు. ఆ బ్రాహ్మడి భార్య, పుత్రుల ఆహారం కూడా అతిథి భుజించాడు.

అంతటితో అతని ఆకలి తీరి సంతోషంగా ఆ ఇంటిలోని వారిని దీవించి వెళ్ళాడు. అతను తినగా విస్తరి బయట పడ్డ ఆ పేలపిండిలో నేను దొర్లాను. అప్పుడు ఆ పిండి అంటుకున్నంత మేర నా శరీరం బంగారువర్ణం లోకి మారింది.

ఇంత వైభవంగా ఇన్ని లక్షల వరహాలు దానం చేసినా నీ యాగ భస్మానికి ఆ పుణ్య విశేషం లేదు. ఎందుకంటే నీవు ఫలాపేక్షతో దానం చేశావు.

ఆ పేద బ్రాహ్మడు నిష్కల్మషమైన మనసుతో అతిథి సేవ చేశాడు అన్నది. ధర్మరాజు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here