లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి. | Dhantrayodashi in Telugu.

0
4585
లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి. | Dhantrayodashi in Telugu.
Dhantrayodashi in Telugu.
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Back

1. నవంబర్ 5 – ధన త్రయోదశి

ధన త్రయోదశినే ” ధన్ తేరస్” అని అంటూంటారు. మార్వాడీలు (కుదువ వ్యాపారస్తులు) కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీపూజ చేస్తారు . మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది. రాజ్యబ్రహ్ష్టుదైన ధర్మరాజు తాము పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునే ఉపాయం చెప్పమని శ్రీ కృష్ణుణ్ణి కోరుతాడు. సమాధానంగా శ్రీ కృష్ణుడు వామనావతారం గురించి వివరించి ” బలిచక్రవర్తి ఆడినమాట తప్పక, తనను అంతమొందించడానికి వడుగు రూపంలో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసికూడా దాన మిచ్చినందుకు వామనుడు బలిచక్రవర్తికి వరం ఇస్తాడు ” – అని చెప్పి , బలి – ” దేవా! ఈ భువిపైన ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి అమావాస్య వరకు నా రాజ్యం ఉండేలాగ ఈ మూడు రోజులూ ప్రజలందరూ ” దీపదానాలు”, “దీపారాధనలు” చేసుకొనేలగ, తన్మూలంగా లక్ష్మీ అనుగ్రహం పొందేలాగా అనుగ్రహించు” మని కోరగా, వామనుడు” తధాస్తు” అని దీవిస్తాడు.

అప్పటినుంచీ ఈ మూడు రోజులూ లక్ష్మీ పూజలు జరుపుకోవడం ఆచరమైంది” అందుచే యుధిష్ఠిరుణ్ణి కూడా అలా చేయమంటాడు గోపాలుడు.

సకల సిరులకు, అష్త్టెశ్వర్యాలకు, నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here