ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

0
615
Dhanurmasa Vratham Puja Vidhi & Rules
What are the Dhanurmasa Vratham Puja Vidhi & Rules?!

Thiruppavai / Dhanurmasa Vratham Pooja Vidh

1ధనుర్మాస వ్రత విధానం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

  • బ్రహ్మ ముహూర్తంలో (ఉ: 3 గంటలకు) మెల్కోని కాలకృత్యాలు, స్నానం చేసి శుబ్రమైన తెల్లని వస్త్రాలని ధరించి శుభకరమైన ఊర్ధ్వతిలకం పెట్టుకొని ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళాలి.
  • ఫూజ గదిలో శ్రీ రంగనాధుడు, శ్రీ గోదాదేవి లేదా శ్రీ కృష్ణుడు, శ్రీ గోదాదేవి పటాలను ప్రత్యేక పీఠంపై పెట్టి అలంకరించి వారిని మనస్పూర్తిగా ఆరాధించడం ప్రారంభించాలి.
  • దేవతా చిత్ర పటాలకు అర్ఘ్య, పాద్య, ఆచమనాలు, స్నానం, చందనంలను పూసి పుష్పాలు, తులసీదళాతో దేవతా మూర్తులకు వారి వారి అష్టోత్తర శతనామావళులతో అర్చన చేయాలి.
  • తదుపరి ధూప, దీప, నైవేధ్యాలు (పొంగలి) సమర్పించాలి.
  • “లక్ష్మీచరణలాక్షాంక స్వోచ్చిష్టమాలికా” అనే శ్లోకంతో మంగళనీరాజనం సమర్పించాలి.
  • ధనుర్మాస వ్రత సేవా కాలం చేయాలి అంటే ఆళ్వార్, ఆచార్య ప్రార్ధన, తిరుప్పళ్ళి యొళుచ్చి (శ్రీ రంగనాధ సుప్రభాతం), తిరుప్పావై పాశురాలు మరియు తెలుగు గేయాలను భక్తి శ్రద్దలతో పఠించాలి.
  • మళ్ళి ర్ఘ్య, పాద్య, ఆచమనాలు చేసి ప్రత్యేక ఆరగింపు (దద్దోజనం, పండ్లు, పులిహోర, చెక్కర పొంగలి లేదా భక్ష్యాలు) తినాలి.
  • తాంబూలం సమర్పించిన తర్వాత కర్పూర హారతితో మంగళాశాసన శ్లోకాలు చదవాలి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back