ధనుర్మాసం అంటే ?

0
5917
dhanurmasam
Dhanurmasam Significance

Dhanurmasam Significance

మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత ధనుర్లగ్నం నుండి ధనుర్మాసం ప్రారంభమై భోగి నాడు ముగుస్తుంది. పురాణ కాలం లో అంటే ద్వాపరయుగం లో బృందావనం నందు గోపికలు, శ్రీ కృష్ణుడినే పతి గా పొందాలని, కాత్యాయని దేవిని పూజిస్తూ, కాత్యాయని వ్రతం చేసేవారు.

ఆ విధంగానే కలియుగం లో శ్రీరంగానికి 90కి.మీ దూరంలో ఉన్న శ్రీ విల్లిపుత్తూరు లో నివిసిస్తూ ఉన్న విష్ణుచిత్తుడనే వైష్ణవ భక్తుడు ఉండేవారు.

అతని కుమార్తె పేరు ఆండాళ్ ( గోదాదేవి), ఆమె కృష్ణుడికి గొప్ప భక్తురాలు. విష్ణు చిత్తుడు కూడా రంగనాథుని పరామభక్తుడు.

ఆండాళుకు శ్రీకృష్ణుడే లోకం, ఆయనపైనే ప్రేమను పెంచుకుంది. ఆయనను భర్తగా తలంచింది. విల్లిపుత్తూరు లో కృష్ణ మందిరానికి రోజు తండ్రి తో కలిసి ఆండాళ్ కూడా వెళ్లి దర్శనం చేసుకొనేది.

వెళ్ళేటప్పుడు పూల మాలలను తనే స్వయంగా కట్టి, ముందుగా తను అలంకరించుకొని, తిరిగి స్వామికి సమర్పించేది.

ఒకరోజు గుడిలోని పూజారి పూలమాలలోని వెంట్రుకను చూసి దాన్ని ముందుగా ఎవరో అలంకరించుకోన్నారని గ్రహించి, ఆగ్రహించి మాలను తిరస్కరించారు.

గోదాదేవి సాధన ఆ విధంగా కొన్ని రోజులు జరిగాక. శ్రీ రంగనాయకుడు ఆండాళును వివాహం చేసుకొన్నారు. తదుపరి ఆండల్ స్వామి వారిలో లీనం ఐనది.ఈ వృతాంతం అంతా శ్రీకృష్ణ దేవరాయలు వ్రాసిన ఆముక్త మాల్యద లో వివరించబడినది.

గోదా రంగనాయకుల వివాహం భోగి రోజున జరిగింది కావున భోగి కల్యాణం అని వాడుకలోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here