హనుమంతునికి వివాహం జరిగిందా..? | Hanuman Married ? In Telugu

0
4135
did-lord-hanuman-get-married
హనుమంతునికి వివాహం జరిగిందా..? | Hanuman Married ? In Telugu

హనుమంతునికి వివాహం జరిగిందా..? | Hanuman Married ? In Telugu

హనుమంతుని అస్ఖలిత బ్రహ్మచారిగా భావించి హిందువులు పూజిస్తారు. ఆంజనేయుడు బలానికీ, నిగ్రహానికీ, ధైర్యానికీ ప్రతీక. ఆయనను మహా యోగిగా పరిగణిస్తారు. మరి అటువంటి హనుమంతుడు వివాహితుడు అని చెప్పే కథలు చాలా చోట్ల ప్రచారం లో ఉన్నాయి. హనుమంతునికి నిజంగానే వివాహం జరిగిందా. ఆయన ధర్మపత్ని ఎవరు..?

Next

2. సువర్చలా హనుమంతుల వివాహ కథ

ప్రచండమైన సూర్యుని కాంతికి ఆయన భార్య అయిన చాయా దేవి తట్టుకోలేక పుట్టింటికి చేరింది. ఛాయాదేవి తండ్రి దేవశిల్పి విశ్వకర్మ. ఆయన కూతురి సమస్యను పరిష్కరించడానికి సూర్యభగవానుని కాంతిని తగ్గిస్తాడు. అప్పుడు ఛాయాదేవి మళ్ళీ సూర్యుని చేరుకుంది. వారిద్దరికీ జన్మించిన అసమాన తేజోమూర్తి సువర్చలాదేవి. ఆమె సూర్య తేజస్సును పుణికి పుచ్చుకుంది. సువర్చలకు వివాహం చేయదలచి సూర్యుడు ఆమెకు వరుని కోసం వెతకగా, ఆమె తేజస్సును తట్టుకోగలిగిన వారెవ్వరూ ఆయనకు కనిపించలేదు. అప్పుడు సూర్యభగవానుడు బ్రహ్మదేవుని ఆశ్రయించి సువర్చలా వివాహానికి మార్గం చూపమని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు వాయునందనుడు, మహా పరాక్రమశాలి, ప్రచండ తేజో మూర్తి అయిన ఆంజనేయుడే సువర్చలకు తగిన వరుడని చెబుతాడు. సూర్యుడు ఆంజనేయుని వద్దకు వెళ్ళి సువర్చలను వివాహమాడవలసిందిగా కోరాడు. ఆంజనేయుడు తన బ్రహ్మచర్య దీక్షను గురించి  సూర్యునికి విన్నవించాడు. ఆంజనేయుని బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం కలగదని ఒప్పందం చేసుకుని సూర్యుడు తన పుత్రిక అయిన సువర్చలా దేవితో ఆంజనేయునికి వివాహం నిశ్చయించాడు. దేవగురు బృహస్పతి వీరి వివాహ ముహూర్థాన్ని నిర్ణయించాడు. జ్యేష్ట శుద్ధ దశమి, ఆదివారం నాడు,ఉత్తరా నక్షత్ర యుక్త సింహ లగ్నంలో, ముప్ఫై రెండుకోట్ల దేవతల దీవెనలతో వివాహం జరిగింది.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here