శివుడు వచ్చి వెళుతున్న ప్రదేశం ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

0
3587

మనందరికీ తెలుసు ఈ సృష్ఠి పుట్టిందే ఓంకారం నుండి. హిందువులందరూ మాత్రమే కాక యావత్ విశ్వంలో ఉన్న ప్రతీ ఒక్క ప్రజానికం ఆ పరమేశ్వరుడే సాక్ష్యాత్తు ఓంకార స్వరూపమని భావిస్తాం.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని ఆ శివ నామము ముందు మనం ఓంకారాన్ని పలుకుతాము. ఓం కారం పుట్టిందే ఆయన నుండి ఈ ఓంకారం అనునని ఆ సర్వేశ్వరుడు నిరాకారుడు పలికినప ప్రణమనాధమనే జ్యోతి నుంతి ఉధ్భవించినది. ఈ ఉధ్భవించిన శృతి నాదమే ఓంకారము.

ఓంకార పర్వతము. ఇది ఒక అధ్భుత సృష్టి.

ఓం అంటే హిందువుల్లో అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ప్రణవనాధము ప్రతీ ఒక్క దేవీదేవుళ్ళ ను పలుకరింపుగా ఉంటుంది.  ఈ ఓంకారం నుండే సృష్టి ఉధ్భవించింది. మనం ఏ పూజ చేసినా, ఏ కార్యము చేసినా, ఏ వ్రతము ఆచరించినా, మొదలు పెట్టేది ఈ ఓంకారముతోనే ఏ దేవుడిని కొనియూడినా ఓం అని ఈ ప్రణవ నాథమును ఉపయోగించనిది మొదలుపెట్టము.

ఓం కారము సృష్టికి మూలము.

పూర్వకాలములో ఓంకారము పలికిన వాళ్ళకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని భావించేవాళ్ళు. కానీ పూర్వము అష్టైశ్వర్యాలతో పనిలేకుండే ఎందుకంటే ఆరోగ్యమునకు మించిన ఐశ్వర్యము మరొకటి లేదని భావించేవాళ్ళు. అందుకే ఆరోగ్యము కొరకు ఈ ఓంకార ప్రణవనాథాన్ని పలికేవారు. అది ఎలా అంటే ఈ ఓంకారంతోనే మునులు, దేవుళ్ళు బ్రతికేవారు. రోజుల తరబడి, యేళ్ళ తరబడి తపస్తు చేసేవారు. నాభి నుండి మొదలయ్యే ఆ ప్రణమ నాథము మెదడులోని నరాలను కూడా కదిలిస్తుంది.

ఇక ఓం నమః శివాయ అంటే మానసిక ప్రశాంతతను మనకు చేకూర్చుతుంది. మన మనస్సులో ఎలాంటి ఇతర విదములైనటువంటి అలజడి మానసిక ఇబ్బందులనేవి ఉన్నా కూడా ఓం కారనాదం తొలగిస్తుంది. ఇది ఒక అత్యంత పవిత్రమైన పదం. ఇది ఒక పరమ పవిత్రమైన హిందూ మత ప్రతీక.

ఇంత గొప్పనైన ఓం కార పర్వతము హిందువులు అతి పవిత్ర పుణ్య క్షేత్రంగా, ఇది ఒక మిరాకిల్ గా, ఆ పరమేశ్వరిని అధ్భుత సృష్టిగా మనకు హిమాలయాలలో కనిపిస్తుంది అది మనందరి అదృష్టమే.

నిజమైన ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి పుణ్యక్షేత్రంలో మనం పవిత్రమైన ఓంకారాన్ని చూడవచ్చును. అది ఎక్కడో  అనుకోకండి అది ఎక్కడోకాదు హిమాలయాల్లోనే.

పైన మనకు కనిపిస్తున్న దానినే ఓంకార పర్వతం అంటారు. ఈ ఓం పర్వతం భారత్,నేపాల్ సరిహద్దులో వుంది. ఈ ప్రాంతం కొంత నేపాల్, మరో కొంతభాగం ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. దూరం నుండి చూస్తే మంచుతో ఓంకారం స్పష్టంగా కనిపిస్తుంది.

 

ఈ పర్వతము వెనకాల గల నల్లటి కొండ ఉండటంతో ఈ ఓం పర్వతం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ కొండను చూడాలంటే పెట్టిపుట్టాల్సిందే ననంటారు పండితులు. ఎందుకంటే పురాణాల ప్రకారం ఎనమిది ఓం కార పర్వతాలు ఉండాలి. కాని మనకు అత్యంత స్పష్టంగా కనిపించేది ఈ ఓంకార పర్వతం మాత్రమే. పైగా ఇది కైలాసపర్వతాన్ని పోలివుండటం మరోవిచిత్రం.

దీనికి ఆది కైలాస్ అని, చోటా కైలాస్ అని,బాబాకైలాస్ అని కూడా పేర్లువున్నాయి. దీనికి ప్రకృతి పరంగా కూడా ఈ పర్వతానికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అని అంటారు. ఆగస్టు-సెప్టెంబర్ సమయంలో చూస్తే ఈ పర్వతానికి ఓంకార బొట్టుపెట్టినట్లుగా కనిపించి భక్తులను ఆకట్టుకుంటుంది.

ఈ పర్వతాన్ని కైలాసమానస సరోవర యాత్రచేసే వాళ్ళు ఓం పర్వతాన్ని కూడా దర్శించుకుని తమ జీవితాలను ధన్యం చేసుకోవచ్చును. ఆ ముక్కంటి తిరిగిన ముల్లోకాలలో ఒక్కటైన ఈ ప్రాంతాన్ని చూడాలంటే నిజంగా అదృష్టం వుండాల్సిందే.ప్రతి ఒక్క హిందువు ఈ ఓం పర్వతాన్ని చూడలేక పోయినాకూడా ఆయన మనకిచ్చిన ఓంకారాన్ని పాటించినాకూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది.

ఇప్పుడు మన టైటిల్లో పెట్టిన విషయానికి వద్దామండీ అదే శివుడు ఇక్కడికి వచ్చి వెళుతున్నాడనేది.

ఈ ఓంకార పర్వతానికి సాక్ష్యాత్తూ ఆ పరమ శివుడు వచ్చివెళుతూ ఉంటాడు అని కూడా చాలా మంది హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆ పరమ శివుడు కైలాసగిరి పర్వతం తర్వాత ఇక్కడికే ఎక్కువగా వచ్చివెళుతూ ఉంటాడని చెబుతుంటారు.

ఎందుకనగా  మానవాళి, పుట్టుక మొదలయ్యేది ఈ ప్రణవనాదమైన  ఓం కారంతో. యోగ అయినా, పూజైనా సరే ఈ నాదం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి జీవితంలో ఒక సారైనా ఈ ఓంపర్వతాన్ని సందర్శించుకోవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here