
గురుకులం లో విద్యా భోదన , సత్ప్రవర్తన రెండూ సమానం. ఉత్తీరణత కన్నా ఉన్నతత్వం గొప్పది గా గురుకులం లో భావిస్తారు . విద్య విజ్ఞానం ఇస్తే , ప్రవర్తన సర్వతో ముఖాభి వృద్దికి ఉపయోగ పడుతుంది .
అజ్ఞాన తిమిరాంధస్య
జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన
తస్మయి శ్రీ గురవే నమః ॥
అజ్ఞాన దశలో కన్నులు మూసుకొనిపొయిన ఆధ్యాత్మికంగా అంధుడైన శిష్యునికి జ్ఞానం అనే కంటి కలికము పెట్టి గుడ్డితనమును నిర్మూలించి జ్ఞాననేత్రమును తెరిపించినది ఎవరో అట్టి శ్రీ గురుమూర్తికి నమస్కారము. ఇది గురుకులం లో నేర్చుకోనేది .
కాన్వెంట్ లో మనం డబ్బులు ఇస్తున్నాము వారు చదువు చెప్పుతున్నారు. ర్యాంక్ లు వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి ఇంతే పక్కగా వ్యాపార ధొరణితప్ప వేరే పెద్దగా మనకు కనపడవు .సూక్ష్మంగా చెప్పాలంటే కాన్వెంట్ లో గురువు నిల్చోని ఉంటే శిష్యులు కూర్చోని విద్య నేర్చుకొంటారు.అదే గురు కులం లో గురువు కూర్చోని ఉంటే శిష్యులు నిలబడతారు .
ప్రస్తుతం మెకాలే పద్దతి లో మన విద్యా వ్యవస్థ ఉంది . అని బహిరంగ రహస్యం .