శకునము కు లేదా సెంటిమెంట్ కు తేడా?

0
9819

difference-between-omen-and-sentiment

మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశాలు ఈ శకునం మరియు సెంటిమెంట్. రెండిటి కి  కొంచం తేడా ఉంది. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ‘శకునం’ చూసుకొని వెళ్ళమంటారు. ఫలానా విధముగా దంపతులు ఎదురొస్తే మంచిది.పిల్లి ఎదురొస్తే మంచిది కాదు , పనిమీద వెళ్తున్నప్పుడు తుమ్మితే పని జరగదు లేదా ఎక్కడకి అని అడిగితే పని జరగదు. ఇలా శకునాల గురించి చూస్తే చాలానే పెద్దలు చెప్పుతారు .!

దీనిలో కొన్ని శకునాలకి స్త్రీ పురుషుల తేడాలు కూడా ఉంటాయి. అబ్బాయిలకి కుడికన్నులేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. అదే కుడికన్నుఆడవాళ్ళకి అదిరితే మంచిది కాదు అంటారు .

సరే సెంటిమెంటు అనేది మనోభావాలకి సంబంధించినది. ఇది ఒక్కో వ్యక్తికీ ఒక్కో విధంగా ఉండడం చూస్తాం. ఇది లాజిక్ కి అందనిది, సైన్సు నిరూపించలేనిది. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలూ, సినీమా, వ్యాపారం లో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి లాజిక్ కు అందనిది కాబట్టి సెంటిమెంట్ ను ఇక్కడ వివరింప దలుచుకోలేదు .

శకునం కోసం ఇక్కడ వివరిస్తునాను .

శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆయా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభశకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభసూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో శుభసూచకముగా భావిస్తారు.

భారతీయ సంస్కృతిలో సాధారణంగా నల్లపిల్లిని, ఎండు కట్టెలు, ఒంటి బ్రాహ్మణుని, విధవరాలిని, తుమ్మును అశుభసూచకాలుగా భావిస్తారు. ముత్తైదువులను (నిండు సుమంగళి), జంట బ్రాహ్మణులను, ఆవును, పచ్చగడ్డిని శుభసుచకాలుగా భావిస్తారు.

శకున శాస్త్రం అనే గ్రంథం గర్గ ముని ప్రణీతం. పక్షులు చేసే శబ్దమును బట్టి, మనుష్యుల మాటలను బట్టి, శుభాశుభములను నిర్ణయించే విధానాలు ఇందులో తెలుప బడ్డాయి.

పెద్దబాలశిక్ష ప్రకారం
మండుచున్న నిప్పు, కన్య, సింహాసనము, గుర్రము, అక్షతలు, గంధము, పువ్వులు, ఛత్రము, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్త్రీబట్టలు, శంఖానాదము, మంగళ వాయిద్యములులు, వేదఘోష, ఏడ్పులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు మొదలైనవి ఎదురైన మంచి శకునములు.

ఒంటి బ్రాహ్మణుడు, పిచ్చివాడు, చెవిటి, కుంటి, జడధారి, మాలికలు, ఎముకలు, చర్మము, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లము, మజ్జిగ, పాము, కసపు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల విరబోసుకున్నవాడు, దీర్ఘగోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here