
అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు ! | Amavasya Pooja Significance in Telugu !
అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృ దేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలాలి. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం.
ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృ దేవతలు ఏడు గణాలుగా వుంటారని.. తొలి మూడు గణాల దేవతలు అమూర్తులుగా.. అంటే ఆకారం లేనివారుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయని, భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ, సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.
పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు వుంటారట. పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే… తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతిబాధలు ఉండవని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలను పూజించి వారి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తున్నారు.
Related Posts on Moral Doubts
Chaitra Amavasya 2023 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు
మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Mauni Amavasya 2023 in Telugu | మౌని అమావాస్య నిజంగా అంత ప్రమాదకరామా? ఇందులో నిజమెంత?
పొలాల అమావాస్య నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Polala Amavasya pooja In Telugu
ఈరోజు చుక్కల అమావాస్య – గౌరీవ్రతం | Chukkala Amavasya Puja Gauri Vratam In Telugu
Somavathi Amavasya in Telugu | జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య
మహాలయ అమావాస్య – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?