
కైలాస పర్వతానికి నాలుగు రూపాలు కూడా వున్నాయి. ఒకవైపు సింహం, రెండోవైపు గుర్రం, మూడోవైపు ఏనుగు, నాలుగోవైపు నెమలిలాగా ఈ పర్వతశిఖరం కనిపిస్తుంది.
అందులో గుర్రం హయగ్రీవ రూపంలోను, సింహం పార్వతి దేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా వుంటాయి.
నలువైపులా మంచుతో కపబడివున్న ఈ పర్వతం.. పౌర్ణమినాడు మిలమిల మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు.
ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు. ఎవరికి సాధ్యం కాలేదు కూడా. పూర్వం కొంతమంది సాధువులు ఈ అధిరోహించేందుకు ప్రయత్నించి, మధ్యలోనే అదృశ్యమయ్యారు.
ఎందుకంటే… నాలుగు మతాలవారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వత వాలుపై కాలుపెట్టడం మహాపాపమని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.
అయితే ఈ మూఢవిశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా.
దాంతో అప్పటినుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరు వెళ్లలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కి కూడా ఇంతవరకు అంతపట్టడం లేదు. యోగశాస్త్రంలో ఈ పర్వతాన్ని షమస్ర చక్రంగా పేర్కోవడం జరిగింది.
పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండుగా.. ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకుని తల్లి దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి.. అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.
మానస సరోవరం :
కైలాస పర్వతానికి పాదపీఠంలోనే మానస సరోవరం ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంటుంది. మానస్ అంటే మెదడు..
అంటే బ్రహ్మ తన మెదడు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నారు. పూర్వం శివుడు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో ఈ మానస సరోవరంలోనే స్నానం ఆచరించేవాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.
అంతేకాదు.. ఈ సరస్సుకు చుట్టుపక్కల వుండే గృహాల్లో చాలామంది మునులు కొన్ని వేల సంత్సరాలుగా తపస్సు చేసేవారని కూడా చెబుతుంటారు. ఇక్కడే ఔషధ విలువలైన మొక్కలు కూడా కొన్ని కనిపిస్తాయి.
కైలాస పర్వతం
కైలాస పర్వతం… అంటే మౌంట్ కైలాష్. ఇది టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో వుంది.
ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అవి బోన్, బుద్ధిజం, హిందూమతం, జైనిజం. హిమాలయాల్లో వున్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు వున్నాయి.
సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో వున్నాయి. హిందూమతం ప్రకారం.. శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై వున్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి.
మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే వున్నాయి.
కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ.. నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది.
హిందూ ధర్మం ప్రకారం.. శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితిలో వుంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు తెలుపబడింది.
ప్రపంచానికి పునాది వంటిది. తామరు పువ్వు ఆకారంలో వున్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
I felt happy ? so many useful information was shared which is necessary to everyone.
Thank you
ifelthappy somanyusefulinformationwassharedwhichis necessary toeveryone