సన్నబడాలంటే అన్నం మానేయాలా?

1
47340

సన్నబడాలంటే అన్నం మానేయాలా-

Back

3. సన్నబడాలంటే అన్నం మానేయాలని ఎందుకు ప్రచారం జరిగింది

సన్నబడాలనుకునే వారికి స్నేహితులు గానీ మరొకరు గానీ ఇచ్చే మొదటి సలహా అన్నం మానేయమని.మనకి అన్నీ ప్రాంతాల తాలూకు తిండి పదార్థాలూ పట్టణాలలో లభించడం వల్ల, ‘పక్కింటి పుల్లకూర రుచి’ అన్న చందాన మనకు మనరైతులు పండించే అన్నం కన్నావిదేశాల నుండీ ఎగుమతి అయ్యే ఓట్ మీల్ ఆరోగ్య కరంగా తోస్తుంది.

సన్నబడాలంటే ఓట్ మీల్ లేదా గోధుమలు తినమని ఎందుకు సలహా ఇస్తారు….? అంటే వ్యాపార లాభాల కోసం కంపెనీలు, మిడిమిడి జ్ఞానం తో నిపుణులు గా చెలామణీ అయ్యే ఆరోగ్య పర్యవేక్షకులు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఏ ప్రాంతం లో పండే దినుసులు ఆ ప్రాంతం వారికి అనుకూలం. ప్రతి ప్రాంతం లోనూ ఆ ప్రాంతపు సంస్కృతి కి అక్కడి ఆహార అలవాట్లే పట్టుకొమ్మ.  అది దెబ్బకొడితే లాభపడే విదేశీ వ్యాపార సంస్థలు, కోట్లకొద్దీ డబ్బులు మూట గట్టుకోగలిగే మధ్యవర్తులూ అనేకం. కనుక ఆహారపు అలవాట్లను దెబ్బతీయడం ద్వారా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసి మందుల, రూపం లో డబ్బు దండుకోవాలనుకునే వారికీ, సంస్కృతిని నేలమట్టం చేసి అటు మామూలు జనాన్నీ, ఇటు రైతునీ ఏక కాలం లో కూలదోయాలనుకునే ప్రమాదకరమైన ఆలోచనకీ మనం ఊతమిస్తున్నాం.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

  1. లక్ష్మిమానస గారు నమస్కారము మండి థేంక్య్ మంచి విషయాని తెలియజేయంసినందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here