
1. ఇందూరు ఖజురహో
డిచ్ పల్లి రామాలయాన్నే ఇందూరు ఖజురహో అంటాం. అక్కడి అద్భుతమైన శిల్ప సంపద ఖజురహోను పోలి ఉంటుంది. కొండమీద ఉండటం వల్ల ఖిల్లా రామాలయం అని కూడా ఈ దేవాలయానికి పేరు. 14 శతాబ్దంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ నిర్మాణాలలో శ్రేష్ఠమైన కూర్మాకార దేవాలయం ఈ డిచ్ పల్లి రామాలయం. అయితే యే కారణం చేతనో ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. తురుష్కులు ఆ ఆలయం పై దాడి చేసి కొన్ని శిల్పాలను ధ్వంసం చేశారు. అందువల్లే ఈ దేవాలయానికి రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదని పండితులు అభిప్రాయపడతారు. 1949 లో గజవాడ చిన్నయ్య గుప్త అనే భక్తుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఆలయానికి సమర్పించాడు. తురుష్కుల దండయాత్ర తరువాత అప్పటివరకూ ఆలయం లో దేవతా విగ్రహాలు ఉండేవి కాదు.
Promoted Content
Very good information