సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం తెలుసా?

2
13177

download

subramanya swamy birthstory

పరమపురుషుడు – శివుడు, అవ్యక్త శక్తి – ఉమాదేవి వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయి. కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడమే. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలో ఇది ఒకటి.

‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే ‘సంవత్సరాగ్ని’, ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు ఆరు ముఖాలు. ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.

ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే. ‘శివజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం. ‘అహంకారం స్కందం’ అని చెప్పబడ్డ ప్రకారం…. సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ ‘నేను’ అనే భావనే స్కంధుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి.

 

శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు. కుమార స్వామి జననం స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది. శివుడు ధ్యాననిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.

మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు. దాంతో మన్మథుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు. ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది. ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామిని శరవణుడు అని కూడా అంటారు. మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది.

2 COMMENTS

  1. Is there any TIP to have a successful Career in ongoing Job even after we work hard and work Smarter
    To improve our JOB. Not to have any tensions that company will remove us in crisis situation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here