
Why Anjaneya Swamy Likes to Sindhuram in Telugu?
1. సీతమ్మవారి సిందూరం
పూర్వం శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు సీతమ్మ తలంటే స్నానం చేసి నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం‘ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.
ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా ….
తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా … ఇప్పుడు రావద్దు …”
అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా… మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని.
అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు.
హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.