జాతస్యహి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితు మర్హసి !! — 2-27- భగవద్గీతా
పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పుట్టుట తప్పదు.
నిత్య సత్యం అయిన , నిస్సంశం అయిన ఈ విధి విధానం గురించి శోకించుట తగదు. అని భగవద్గీత చెబుతోంది .
మరణం లేకపోతే బాల్యం తెలియకుండా గడిచిపోతుంది , యవ్వనం సుఖ భోగములతో గడిచిపోతుంది . చివరికి వార్ధక్యం కూడా భయంకరమైనది. మేదస్సు , శరీరం రెండూ బలహీనం అవుతాయి . వార్ధక్యం లో ఈసడింపులు తో బ్రతుకు భారము అవుతుంది . ఇలా జీవి పరిణామ క్రమం లో ముగింపు వైపు చూసే స్థితి ఏర్పడుతుంది . అందుకే మరణం అనేది ఒకటి భగవంతుడు పెట్టాడు . ఆయన కొద్ది మందిని అర్దాంతరంగా తీసుకొని వెళ్ళుతూ ఉన్నాడు అంటే కారణం వ్యక్తి యొక్క ఋణం భూమి మీద తీరింది అని అర్ధం చేసుకోవాలి .
Chaala manchi articles post chestunnaru bagunnai. Copy , download yela cheyyli