స్త్రీలకు శిరోముండనం ఉందా?

0
2177

కేశాలను తొలగించడం క్షేత్ర యాత్రలలో, కొన్ని ప్రాయశ్చిత్త విధులలో, కొన్ని కర్మలలో ముఖ్యం. ఎందుచేత? స్త్రీలకు శిరోముండనం ఉందా?

చేసిన పాపాలు అంతరంగాన్ని ఆశ్రయించి జీవుని అనుభవంలోకి వస్తుంటాయి. అయితే వాటి ప్రభావాన్ని దేహంలో గ్రహించి, వదలకుండా పట్టుకొనే చోటు కేశాలు. అందుకే వాటిని తొలగించి స్నానాదులు చేసినవారు శుద్ధులౌతారు. దీక్షాకాలమంతా మరి వాటిని తొలగించరు. దీక్షానంతరం తొలగిస్తారు. దీక్షాకాలంలో చేసిన నియమపాలన అంతరంగాన్నిశుద్ధిచేస్తుంది. మిగిలిన కొన్ని పాపాలు, దీక్షాకాలంలో పొరపాటున జరిగిన దోషాలు పోవడానికి విరమణ తరువాత కూడా కేశాలను తొలగిస్తారు.

మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ!
కేశానాశ్రిత్య తిష్ఠంతి తస్మాత్ కేసోవపామ్యహమ్!!

– అని ధర్మశాస్త్రం, ’కొండలంతటి బహుపాపాలు కేశాలనాశ్రయించుకొని ఉంటాయి. అందుకే వాటిని తొలగిస్తున్నాను’. అయితే శాస్త్రరీత్యా స్త్రీకి కేశములు మంగళ స్థానీయములు. వారు దీక్షాకాలంలో, కర్మలలో కేశాలను తొలగించనవసరం లేదు. వారి దేహ ధర్మరీత్యా ఋషులు నియమించిన విధి ఇది. వారు గోమయం, పంచగవ్యాలు, మృత్తికాజలం (తులసిమట్టి నీరు), పసుపు రాసుకొని స్నానం చేయడం వంటివి శుద్ధిని కలిగిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here