మాఘ పూర్ణిమ రోజు దానాలు చేస్తే..

0
8277

pournami

గ్రహాణాం చ యధా సూర్యో నక్షత్రాణాం చ చంద్రమాః |
మాసానాం హి తథా మాఘః శ్రేష్ఠః సర్వేషు కర్మసు ||

అని గురు చరిత్ర నలభై ఏడవ అధ్యాయము లో కార్తవీర్యుడు మాఘ మాస ప్రశస్తి గురుంచి వివరిస్తాడు.

గ్రహాలలో సూర్యుడు ఎలాగైతే గొప్పవాడో, ఎలాగైతే నక్షత్రాలలో చంద్రుడు గొప్పవాడో, అలాగే మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకూ శ్రేష్టమైనది.

మాఘపౌర్ణమి నాడు దానాలు చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు దాన ధర్మాలు చేయడం వలన సర్వదేవతానుగ్రహం కలుగుతుంది. బీదవారికి భోజనం పెట్టడం వలన ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.  శని ప్రభావం ఉన్నవారు చెప్పులను దానం చేయాలి. చంద్ర గ్రహ ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటున్నవారు వస్త్రదానం చేయడం వలన చంద్ర గ్రహాపీడలు తొలగుతాయి. కుజ ప్రభావం ఉన్నవారు ఎర్రని వస్త్రాలను, కందిపప్పును/ఎర్రపప్పు ను దానం చేయాలి. నేడు బీద విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టడం ద్వారా ఇంటిల్లిపాదికీ మంచిది. చదువుకునే పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. రాహు కేతు దోషాలు ఉన్నవారు తేనెను, ఖర్జూరాలను దానంచేయాలి.

అలాగే తిలతైలేన దీపాశ్చ దేయాః శివగృహే శుభాః నువ్వుల నూనెతో శివునికి దీపారాధన చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here