స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట

0
1275

స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట

“మనము స్వప్నముల యందు వివిధ దేహములను మనముగా భావించెదము. మనము మనలను ఒక రాజుగా లేక బీదవాడుగా లేదా స్త్రీగా స్వప్నమందు చూసుకొనవచ్చును. స్వప్నమందు మనము, “ఇది నేను” అని తలచుచుందుము. మేల్కొనినప్పుడు, అది స్వప్నమని కనుగొందుము మరియు ఆ తాత్కాలిక స్వప్న దేహము అదృశ్యమగును. ఆదే విధముగా భౌతిక ప్రకృతి ప్రభావముచే మనకు ఈ జీవితమున ఒక ప్రత్యేకమైన దేహము లభించును. మనము ఆ దేహము మనముగా తలచుచూ దానిని అన్వయించుకొందుము. మనము మన యదార్థ అస్థిత్వమున మేల్కొనినప్పుడు, ఈ తాత్కాలిక దేహము మనము కాదని కనుగొందుము.

మనము స్వప్నము చూచు చున్నప్పుడు అది కొన్ని క్షణములు పాటు నిలిచియుండును; మనము రాత్రి ఐదు, ఆరు లేక ఏడు గంటల పాటు నిద్రించెదము.

కాని ఈ తాత్కాలిక దేహము దాదాపు నూరు సంవత్సరములు, లేదా యాభై సంవత్సరములు లేద డభై సంవత్సరములు నిలిచియుండును. సాపేక్షమున చూచినట్లయిన ఇది మరింత యదార్థముగా అగుపడుచుండును.
స్వప్నములు తరచూ మారుచుండవచ్చును. మన శాశ్వత అస్థిత్వమున సంబంధించి చూసినట్లయిన, ఈ భౌతిక జగత్తు మనకు ఇచ్చు ఈ తాత్కాలిక దేహము కూడా క్షణభంగురమైనది. అతి స్వల్ప కాల పరిమితి కలిగియుండును.
అందుచేత దీనిని స్వప్నముతో పోల్చవచ్చును.

స్వప్నమునందున్నప్పుడు, అది యదార్థముగా అగుపడుచుండును. మనము చూచు స్వప్నము చక్కనిదైనను, పీడకలయైనను, దానిని అనుసరించి ఆనందమును, సుఖములను, బాధలను, వ్యాకులమును, భయమును అనుభవించుచుందుము.”

పూజ్య శ్రీ జయపతాక స్వామి
శ్రీమద్భాగవతము ఉపన్యాసము
6.1.49

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here