గృహ చికిత్సతో పొడిదగ్గు మాయం | Dry Cough Home Remedies in Telugu

0
2747
Dry Cough Home Remedies in Telugu | dry cough corona | dry cough treatment in telugu | Dry Cough: Symptoms, Causes, Treatment, Home Remedies
గృహ చికిత్సతో పొడిదగ్గు మాయం | Dry Cough Home Remedies in Telugu

పొడిదగ్గు నివారణకు గృహ ఏ చికిత్సలో పలు మార్గాలున్నాయి. బాగా పండిన అరటి పండు గుజ్జుకు ఒక టీస్పూన్ తేనెను, చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. దీనిని అవసరాన్నిబట్టి రెండు, మూడు సార్లు తినవచ్చు.

ఔషధాలు

  • సితోఫలాది చూర్ణం పూటకు అరచెంచాడు పొడిని చెంచాడు తేనెతో రెండు పూటలా తీసుకోవాలి.
  • ఏలాది వటి, తడవకు ఒకో మాత్రను నోటిలో పెట్టుకొని చప్పరించి రసం మింగుతుండాలి. అవ సరాన్నిబట్టి రోజుకు 4-6 సార్లు వాడవచ్చు.
  • లవంగాది వటి, తడవకు ఒకో మాత్రను నోటిలో పెట్టుకొని చప్పరించి రసం మింగుతుండాలి. అవసరాన్నిబట్టి రోజుకు 4-6 సార్లు వాడవచ్చు.
  • తాళిసాది చూర్ణం అరచెంచాడు, అతి మధురం వేరు పొడి (యష్టిమధు చూర్ణం) అర చెంచాడు కలిపి నీళ్ళకు చేర్చి టీ మాదిరిగా కషాయం తయారుచేసుకొని తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఎండిపోయిన కఫాన్ని కరిగించి వెలుపలకు తీసుకురావడనాకి కఫ నిసాసన ఔషధ కల్పం వాడుకోవచ్చు. తాళిసాది చూర్ణం 3 గ్రా. అతిమ ధురం పొడి, 3 గ్రా. టంకణ భస్మం 1గ్రా. ప్రవాళ భస్మం 500 మి.గ్రా. శృంగి భస్మం 250 మి.గ్రా. కలిపి తేనె అనుపానంగా రెండు పూటలా విభ జించి తీసుకోవాలి.
  • లక్ష్మీవిలాస రసం (నారదీయ) పూటకు ఒక మాత్ర చొప్పున, రెండు పూటలా నీళ్ళతో తీసుకోవాలి.
  • చిత్రక హరీతకీ లేహ్యం , పూటకు ఒక చెంచాడు ఔషధాన్ని రెండు పూటలా తీసుకోవాలి.
  • కర్పూరాది చూర్ణం, పూటకు పావు చెంచాడు పొడిని సమాన భాగం పంచదారతో రెండు పూటలా తీసుకోవాలి.
  • శ్వాసానంద గుటికా, పూటకు, ఒక మాత్రను జీలకర్ర కషాయంతో భోజనానికి ఒక గంట ముందు రెండు పూటలా తీసుకోవాలి.
  • గోదంతీ భస్మం 120-500 మి.గ్రా. పొడిని సమాన భాగం తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
  • ప్రవాళ భస్మం 60-120 మిగ్రా. పొడిని అర కప్పు పాలతో కలిపి గాని లేదా చెంచాడు తేనెతో కలిపిగాని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
  • వాసావలేహ్యం పూటకు రెండు చెంచాల వంతున రెండుపూటలా తీసుకోవాలి.
  • వాసాకంటకార్యలేహ్యం పూటకు అరచెంచాడు ఔషధాన్ని అరకప్పు నీళ్ళతో భోజనానికి ముందుగాని, తరువాత గాని రెండుపూటలా తీసుకోవాలి.

శ్లేష్మంతో కూడిన దగ్గు..కొన్ని చికిత్సలు

 • కఫంతో కూడి వచ్చే దగ్గుకు ప్రభావంతమైన తేలికపాటి గృహ చికిత్స మిరియాలు. పావు చెంచాడు మిరియాల పొడిని టీస్పూన్ తేనెతో కలిపి భోజనం తరువాత తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ గొంతు బొంగురు ఉంటే తనకు బదులుగా మిరియం పొడికి నెయ్యి కలిపి తీసుకోవాలి. దీనిని రోజుకు 2-3 సార్లు చొప్పున నాలుగైదు రోజులపాటు తీసుకుంటే గుణం కనిపిస్తుంది.
 • తమలపాకు రసాన్ని చిక్కగా తయారయ్యే వరకూ వేడిచేసి చల్లారిన తరువాత తేనె కలిపి తీసుకుంటే కళ్ళే బయటపడి దగ్గు తగ్గుతుంది.
 • అల్లం రసాన్ని పూటకు చెంచాడు మోతాదులో సమానభాగం తేనె కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
 • ఒక కప్పు నీళ్ళను మరిగించి అరచెంచాడు శొంఠి పొడిని, చిటికెడు లవంగాల పొడిని, చిటికెడు దాల్చిన చెక్క పొని కలిపి టీ మాదిరిగా తయారుచేసుకొని తీసుకుంటే కఫసంబంధమైన దగ్గులో ఉపశమనం లభిస్తుంది. కేవలం చిటికెడు లవంగాల పొడిని చెంచాడు తేనెతో కలిపి తీసుకున్నా సరిపోతుంది. లేదా ఒకటి రెండు లవంగాలను తమలపాకు మధ్య పెట్టు కొని నమిలి తినవచ్చు.
 • ఎండు ద్రాక్ష, అతిమధురం వేరు, ఎండు ఖర్జూరం, మిరియాలు వీటిని సమాన భాగాలు తీసుకొని మెత్తగా నూరి పొడిచేసి నిల్వ చేసుకోవాలి. దీనిని పూటకు పావు ఎంచాడు నుంచి అరచెంచాడు మోతాదులో రెండు పూటలా చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే శ్లేష్మసంబంధమైన దగ్గు తగ్గుతుంది.
 • ఆవాలు పొడి అరచెంచాడు, శొంఠిపొడి అరచెంచాడు కలిపి చెంచాడు తేనెను చేర్చి నెమ్మదిగా చప్పరించాలి. ఇది దీర్ఘకాలపు దగ్గులో ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. రోజుకు రెండు, మూడుసార్లు చొప్పున దగ్గు తగ్గేవరకూ తీసుకోవచ్చు. (ఆవాలు వేడిని ఉత్పన్నం చేసి కఫాన్ని కరిగిస్తుంది. శొంఠి దోషాలను శోధిస్తుంది).
 • అర చెంచాడు వెల్లుల్లి ముద్దకు చిటికెడు త్రికటు చూర్ణం (శొంఠి, పిప్పళ్ళు, మిరియాల పొడి) కలిపి తగినంత తేనె చేర్చి ఉదయం, సాయం కాలాలు రెండు పూటలా తీసుకుంటుంటే దీర్ఘకాలం నుంచి వేధించే దగ్గు క్రమంగా తగ్గుతుంది.
 • తాజా అడ్డసరం (వాసా) ఆకులను దంచి గుడ్డలో వేసి రసం పిండి పూటకు రెండు చెంచాలు మోతాదులో సమానభాగం తేనె కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
 • కమలం గింజల పొడిని అరటీస్పూన్ మోతా దులో తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
 • మూడు భాగాల వేడినీళ్ళకు ఒక భాగం తేనె కలిపి పూటకు అరకప్పు మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి.
 • త్రికటు చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదులో సమానభాగం మిశ్రి (పటికబెల్లం) పొడిని కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
 • నేలవాకుడు (కంటకారి) మొక్కతో కషాయం తయారుచేసి టేబుల్ స్పూన్ మోతాదులో చిటికెడు పిప్పళ్ళ చూర్ణం కలిపి రెండుపూటలా తీసు కోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here