
దూర్వాగణపతి వ్రతం | Durva Ganapathi Vrutham in Telugu
Durva Ganapathi Vrutham , విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ” గరిక (గడ్డి) ” పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము .
గరికతో పూజిస్తాం గనుక ఈ స్వావిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు. ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచల తో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది.
యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి .
అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరము లో అమితమైన వేడి పుట్టింది .
దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను , అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది . నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …. అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను .
సంస్కృతము లో గరికను ” దూర్వలం ” అంటారు . శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది.
శ్రావణమాసం లో వచ్చే బహుళ చతుర్ధి గణపతి కి అత్యంత ప్రీతికరమైన రోజు . ఈ రోజున సంకష్టహర చతుర్ధీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం . ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి. దూర్వా గణపతి వ్రతంనాడు స్వామిని 21 రకాల గరికతో పూజించడం వలనే ‘దూర్వా గణపతి’ అంటారు.
ఈ వ్రత విధానంలో 21 నామాలతో వినాయకుణ్ణి అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.
- ఓం గజననాయ నమః
- ఓం గణపతయే నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం ధరణీ ధరాయ నమః
- ఓం మహా గణపతయా నమః
- ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
- ఓం క్షిప్రప్రసాదనాయ నమః
- ఓం అమోఘ సిద్దియే నమః
- ఓం అమితాయ నమః
- ఓం మంత్రాయ నమః
- ఓం చింతామణయే నమః
- ఓం నిధయే నమః
- ఓం సుమంగళాయ నమః
- ఓం బీజాయ నమః
- ఓం ఆశాపూరకాయ నమః
- ఓం వరదాయ నమః
- ఓం శివాయ నమః
- ఓం శాక్యపాయ నమః
- ఓం పార్వతీనందాయ నమః
- ఓం వాక్యతయే నమః
- ఓం ఢుంఢి వినాయకాయ నమః
దూర్వా గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖసౌఖ్యాలు.. శుభాలు కలుగుతాయని తెలుస్తుంది.
మూలము : సత్యాన్వేషన – స్వాతి వారపత్రిక 20-8-2010 పేజి 49.
(Courtesy with Swati weekly Telugu magazine )