దుష్ట శిక్షణ శిష్ట రక్షణ – వామన పురాణం లోని కథ

0
1201

ఒకానొక సమయంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహరులు తమ ఆయుధాలను మార్చుకోవల్సివచ్చింది.
ఈ కధ వామన పురాణం లో ఉంది.

పూర్వం జలోద్భవుడనే రాక్షసుడు తీవ్రమైన తప్పస్సుతో బ్రహ్మను మెప్పించి,తాను ఏ దైవం వలన మరణించకుడదని ,ఒక వేళ్ళ మరణం ఆసన్నమైతే ఆయ దేవతల స్వంత ఆయుధాలతో మరణించకుడదని వరం కోరుకుంటాడు. అంతే కాదు..పంచభూతాల్లో పరకాయ ప్రవేశం చేసే శక్తిని ప్రసాదించమని కోరుతాడు. అంటే నెళ్ళలో ముణిగితే ,జలోత్భవుడు ఆ నీళ్ళలో కరిగిపోయి నీళ్ళులా కనిపిస్తాడు. అదే విధంగా అగ్నిలో దూకితే అగ్నిలా మారిపొతాడు. అటు వంటి వరాలను పొందిన జలోద్భవుడు,వరగర్వంతో సమస్త లోకాలను పీడించసాగాడు.

జలోద్భవుడు ఆగడాలతో విసిగిపోయిన సర్వ లోకవాసులు, తమ కష్టాలను హరిహరలును విన్నవించుకున్నారు. బ్రహ్మ ద్వారా కష్టాలను హరిహరులు తెల్సుకున్నారు.. బ్రహ్మ ద్వారా జలోద్భవుని విషియం విన్న హరిహరులు తమ తమ ఆయుధాలను మార్చుకొని ఆ రాక్షసుని సమ్హరించుకోవడం కోసం వెదకసాగారు.

హరిహరులు తనను సమ్హరించెందుకు వెదుకుతున్నారూని తెలుసుకున్న జలోధ్భవుడు, వారికి తెలియకుండా నీళ్ళల్లో కలిసిపోయి పదివేల సంవత్సరాల పాటు దాక్కున్నాడు. ఆ రాక్షసుని వరప్రభావం తెలిసిన హరిహరులు కుడా అదృశ్యరూపాలలో ఆ జల సమీపంలోనే ఓర్పుగా నిరీక్షించసాగారు. ఒక రోజున నీటి నుంచి బయటకు వచ్చిన జలోద్భవుడు, అక్కడ హరిహరులు కనిపించకపోవడంతో ప్రక్కనున్న హిమాలయాలను ఎక్క సాగాడు. ఆ రాక్షసుడుని చూసిన హరిహరులు ఎక కాలంలో తమ శుల -చక్ర ఆయుధాలను మార్చుకొన్నారు. జలోద్భవుడను హతమార్చారు. అప్పుడు ఆ యోగ తాకిడికి హిమాలయాలపై వితస్తానది అనే తీర్ధం నుంచి తనను రక్షించిన అల్లునికి(శివునికి) మర్యాదలు చేశాదు. నేటికి ఈ ప్రంతంలో వితస్తానది ఉంది. ఈ నదిని ప్రప్రధమముగ ప్రహ్లదుడు దర్శించాడు అని పురాణ కధనం.

ఈ తీర్ధానికి పన్నెండు మైళ్ళ దూరంలో భృగుతుంగమనే క్షేత్రం ఉంది. ఇక్కడే పరమశివుడు శ్రీ హరికి చక్రాయుధాన్ని (సుదర్శనం) ప్రదానం చేసాడని చెప్ప బడుతోంది.

అలాగ లోకక్షేమం కోసం హరిహరులు ఆయుధాలను మార్చుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి.

ఈ 27 నామములు పఠించటం ద్వారా కరోనా వంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు