చదువు | About Education In Telugu.

0
8623
చదువు | About Education In Telugu.
About Education In Telugu.

గురువు గారు ఇద్దరు శిష్యులను పరీక్షించాలనుకున్నారు.

“మీరు అదిగో అక్కడ దూరంగా కూర్చున్న కుమ్మరిని చూశారు కదా…. అతనికి నెలరోజుల పాటు చదువు నేర్పించండి.” అన్నాడు గురువుగారు.

శిష్యులు నెలరోజుల పాటు ఆ కుమ్మరి దగ్గరకి వెళ్లి చదువు నేర్పే ప్రయత్నం చేశారు. పలక, బలపం తెచ్చి ప్రయత్నించాడు. ప్లే వే మెథడ్ ను పరీక్షించారు. చేయగలిగిందంతా చేశారు.
నెల రోజులు పూర్తయిపోయాయి.
“గురువుగారూ… నెల రోజులు ప్రయత్నించాను. కానీ ఆ కుమ్మరికి ఒక్క అక్షరం కూడా నేర్పలేకపోయాను.” నిరాశగా అన్నాడు మొదటి శిష్యుడు.
రెండో శిష్యుడూ గురువు గారి దగ్గరకి వచ్చాడు. “గురువుగారూ… నేను కూడా అతనికి ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరమూ నేర్పలేకపోయాను.” అన్నాడు.
కానీ రెండో శిష్యుడి ముఖంలో ఆనందం ఉంది. నిరాశ, విషాదాలు లేవు.

“అతనికి అక్షరం నేర్పలేకపోయాను కానీ… ఈ నెలలో కుండలు తయారు చేయడం నేర్చేసుకున్నాను గురువు గారూ!”

About Education In Telugu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here