
What is arrogance In Telugu.
ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు. అతడికి గొప్పవాడిననే భావన ఎక్కువ. ఒకసారి ఆ రాజు ఓ గురువును కలుస్తాడు. ఆ గురువు మాటలకు ఆకర్షితుడై అతడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు. ప్రతి రోజూ గురువు బోధనలు వింటుంటాడు.
సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయం గురుశిష్యులిద్దరూ వ్యాహ్యాళికి వెళ్తారు. అదే సమయంలో ‘గురువు గారు అహం అంటే ఏమిటి?’ అని ప్రశ్నిస్తాడు రాజు. ఒక్కసారిగా ఆ గురువు ఆగ్రహంతో ఊగిపోతాడు. ‘ఇలాంటి చెత్త ప్రశ్నలు నన్ను అడుగుతావా?’ అని నిందిస్తాడు. గురువు మాటలు రాజుకు కోపం తెప్పిస్తాయి. కాసేపటికి గురువు చిరునవ్వుతో, ‘రాజా, ఒక్క క్షణం ముందు నీలో కలిగిన ఆకస్మిక మార్పే అహానికి ప్రతిరూపం’ అని అంటాడు. గురువు ఆంతర్యం గ్రహించిన రాజు తన తప్పు తెలుసుకుంటాడు.