Ekadashi Story | ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్ఠత, పూజ విధానం, ఉపవాస నియమాలు ఏమిటి?

0
1236
Ekadashi Rituals, Fasting Rules & Significance
What is Ekadashi Tidhi?, Rituals, Fasting Rules & Significance?

What is Ekadashi?

2ఏకాదశి దేవత వెనుక దాగి ఉన్న కథ (The Hidden Story Behind Goddess Ekadashi):

మన పురాణాల ప్రకారం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మహాబలవంతుడు. ఈ రాక్షసుడు త్రిమూర్తుల మీదకి యుద్ధానికి సై అంటున్నాడు. దేవలందరీ ఇబ్బందులకు గురి చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడి నుండి కాపాడమని ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని దగ్గర మొర పెట్టుకున్నారు. వారి మోర విన్న విష్ణుమూర్తి మురాసురునితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం వందల సంవత్సరాలుగా జరుగుతున్న కూడా ఎవరికీ గెలుపు ఓటములు తెలవు. ఒక సమయంలో విష్ణుమూర్తి యుద్ధంలో అలసట తీర్చుకోవడానికి ఒక గుహలో నిద్రపోతారు. ఆ విషయం తెలుసుకున్న మురాసురుఉ విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలనుకుని ఆ గుహ వద్దకు చేరుకుంటాడు. మురాసురుడు అక్కడికి చేరుకున్న వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రభవించింది. ఆ శక్తి హే ఏకాదశి. ఏకాదశి దేవత కేవలం తన యొక్క కంటి చూపుతోనే ఆ రాక్షసుడుని బస్మం చేసింది. అప్పుడు ఏకాదశి దేవతను చూసిన విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమని ఆ దేవికి వరం ఇస్తాడు. అప్పుడు ఏకాదశి దేవత తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారో వారి యొక్క పాపాలన్నీ విముక్తి కావాలని కోరుకుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమె కోరికలు అంగీకరించడంతో ఏకాదశికి ఈ విశిష్టత ఏర్పడింది. విష్ణుమూర్తికి కూడా మురాసురుని సంహరించినందుకు మురారి అన్న పేరు వచ్చింది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.